ఆ ఒక్క కారణంతోనే బిచ్చగాడు సినిమా చేయలేకపోయా: శ్రీకాంత్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో నటుడిగా నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ నటుడు శ్రీకాంత్ (Sreekanth)గురించి పరిచయం అవసరం లేదు.ఇలా కుటుంబ కథ సినిమాలలో నటించిన ఈయన మహాత్మా, ఆపరేషన్ దుర్యోధన, ఖడ్గం, సంక్రాంతి సినిమాలలో విభిన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను సందడి చేశారు.

 Hero Srikanth Interesting Comments About Bichagadu Movie Details, Bichagadu,vija-TeluguStop.com

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శ్రీకాంత్ బిచ్చగాడు(Bichagadu) సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.తాను మహాత్మ (Mahatma)సినిమా చేసే సమయంలో నటుడు విజయ్ ఆంటోనీ(Vijay Anthony) ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారని తెలిపారు.

Telugu Bichagadu, Srikanth, Vijay Anthony, Mahatma, Sreekanth-Movie

మహాత్మ సినిమా సమయం నుంచి తనకు ఆయనకు మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఏర్పడిందని తెలియజేశారు.ఇలా తనతో మంచి పరిచయం ఉండడంతో తాను నటించిన బిచ్చగాడు సినిమాని తమిళ వర్షన్ చూశాను.ఆ సినిమా తనకు ఎంతో అద్భుతంగా నచ్చిందని ఈ క్రమంలోనే ఆ సినిమాని తెలుగులో డబ్ చేసి విడుదల చేయాలని భావించాము.ఇక ఈ సినిమాని నిర్మించాలి అంటే అనుకున్న బడ్జెట్ కన్నా చాలా ఎక్కువ అవుతుంది.

నాకు రెమ్యూనరేషన్ తో పాటు సినిమా కోసం అనుకున్న దానికన్నా భారీగానే ఖర్చులు రావడంతో ఈ సినిమాని తెలుగులో నిర్మించకుండా కేవలం డబ్బు చేసి విడుదల చేశారని తెలిపారు.

Telugu Bichagadu, Srikanth, Vijay Anthony, Mahatma, Sreekanth-Movie

రెమ్యూనరేషన్ అనుకున్న దానిలో కనుక అయ్యు ఉంటే ఈ సినిమాని తెలుగులో తానే హీరోగా నటించేవాడినని ఈ సందర్భంగా శ్రీకాంత్ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక బిచ్చగాడు సినిమా తెలుగులో కూడా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం షూటింగ్ పనులను జరుపుకుంటున్న నేపథ్యంలో నటుడు విజయ్ ఆంటోనీ ప్రమాదానికి గురయ్యారు.

అయితే త్వరలోనే ఈ సినిమా మిగతా కార్యక్రమాలు అన్నింటిని పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధం కాబోతోంది.ఇక శ్రీకాంత్ సినిమాల విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం పలు సినిమాలలో పలు విలన్ పాత్రలలోను హీరోలకు బాబాయ్, అన్నయ్య పాత్రలలో నటిస్తూ సందడి చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube