నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీషా ఓటమి పాలయ్యారు.
నిరుద్యోగ అభ్యర్థుల ప్రతినిధిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన బర్రెలక్క పోస్టల్ బ్యాలెట్ లో ముందంజలో ఉన్నప్పటికీ ఫలితాలలో మాత్రం వెనక్కి వెళ్లిపోయారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు.బర్రెలక్కతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ ఓటమి చవిచూశారు.
అయితే ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కంటే ఎక్కువగా పాపులారీటీ సాధించిన బర్రెలక్క ఓటమి చవిచూడటం చర్చనీయాంశంగా మారింది.