నేడు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఐదో టీ20 మ్యాచ్..భారత జట్టలో కీలక మార్పులు..!

నేడు బెంగుళూరు వేదికగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఐదవ టీ20 మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగనుంది.ఈ మ్యాచ్లో గెలుపు కోసం రెండు జట్లు గట్టి పట్టుదలతో బరిలోకి దిగనున్నాయి.

 India Vs Australia Fifth T20 Match Today.. Key Changes In The Indian Team , Indi-TeluguStop.com

భారత్ ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ ను 4-1 తో సొంతం చేసుకోవాలని అనుకుంటుంటే.ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ లో గెలిచి పరువు నిలబెట్టుకుని ఇంటి ముఖం పట్టాలని భావిస్తోంది.

ఈ మ్యాచ్లో గెలుపు కోసం భారత జట్టు కొన్ని కీలక మార్పులతో మైదానంలో అడుగుపెట్టనుంది.జీతేశ్ స్థానంలో ఇషాన్ కిషన్( Ishan Kishan , ), అక్షర్ పటేల్ స్థానంలో సుందర్ ఆడే అవకాశం ఉంది.

ఇక తిలక్ వర్మ కు అవకాశం ఇవ్వాలంటే.జట్టులో ఎవరిని తప్పిస్తారో చూడాల్సి ఉంది.

Telugu Australia, India, Ishan Kishan, Rinku Singh-Sports News క్రీడ

ఇక భారత జట్టు ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్(Yashasvi Jaiswal ).మ్యాచ్ చివర్లో ఫినిషర్ గా రింకూ సింగ్, భారత జట్టు పేసర్ లు గా ముఖేష్, దీపక్, అవేశ్ ఖాన్ బరిలోకి దిగనున్నారు.ఇక మిగతా ఆట సభ్యులలో ఎవరు జట్టులో ఆడుతారో చూడాల్సి ఉంది.

Telugu Australia, India, Ishan Kishan, Rinku Singh-Sports News క్రీడ

ఇటీవలే ప్రపంచ కప్ గెలిచిన ఆస్ట్రేలియా( Australia ) జట్టు ప్రస్తుతం జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ లో ఘోరంగా విఫలమైంది.ఇప్పటికే ఈ సిరీస్ లో భారత్ టైటిల్ కైవసం చేసుకుంది.కానీ ఈ మ్యాచ్లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ఆస్ట్రేలియా కసితో ఉంది.

ఆస్ట్రేలియా జట్టులో కీలక ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వడంతో ప్రస్తుతం జట్టులో ఉన్న ప్లేయర్లు ఎప్పుడు ఎలా ఆడతారు తెలియని పరిస్థితి ఏర్పడింది.మూడవ టీ20 మ్యాచ్ లో గ్లెన్ మ్యాక్స్ వెల్ జట్టులోకి వచ్చి కాస్త ఆస్ట్రేలియా పరువు కాపాడాడు.

లేదంటే ఆ మ్యాచ్లో కూడా భారత్ పై చెయ్యి సాధించేది.నేడు జరిగే మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు బ్యాటింగ్ లో అద్భుతంగా రాణిస్తేనే గెలిచే అవకాశం ఉంటుంది.

బెంగళూరు పిచ్ బ్యాటింగ్ కు చాలా అనుకూలంగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube