అన్ స్టాపబుల్2 షోకు నాగబాబు, బెల్లంకొండ సురేష్ వస్తే.. ఆ కిక్కే వేరు కదా?

బాలయ్య హోస్ట్ గా ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ సీజన్2 త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.అన్ స్టాపబుల్ సీజన్2 గెస్ట్ లు వీళ్లేనంటూ ఇప్పటికే పలు పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.

 Balakrishna Unstoppable Season2 Guests Nagababu Bellamkonda Suresh Details, Bell-TeluguStop.com

చిరంజీవి, అనుష్క, సమంత మరి కొందరు అన్ స్టాపబుల్ సీజన్2 లో పాల్గొననున్నారని తెలుస్తోంది.అయితే ఈ షోకు నాగబాబు, బెల్లంకొండ సురేష్ వస్తే ఏ విధంగా ఉంటుందనే చర్చ అభిమానుల మధ్య జరుగుతోంది.

అటు నాగబాబుతో ఇటు బెల్లంకొండ సురేష్ తో బాలయ్యకు విభేదాలున్నాయి.నాగబాబు గతంలో బాలయ్య ఎవరో నాకు తెలియదు అంటూ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత కూడా నాగబాబు బాలయ్యను టార్గెట్ చేస్తూ పలు సందర్భాల్లో విమర్శలు చేయడం గమనార్హం.నాగబాబు బాలయ్యను వ్యక్తిగతంగా టార్గెట్ చేయగా అలా టార్గెట్ చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

బాలయ్య పలు సందర్భాల్లో పాడిన పాటలు, గేయాలపై కూడా నాగబాబు సెటైర్లు వేశారనే సంగతి తెలిసిందే.

Telugu Balakrishna, Nagababu, Season, Unstoppable-Movie

ఆ సమయంలో నాగబాబును బాలయ్య అభిమానులు ట్రోల్ చేసినా ఆ ట్రోలింగ్ ను బాలయ్య పెద్దగా పట్టించుకోలేదు.గతంలో బాలయ్య బెల్లంకొండ సురేష్ మధ్య ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.బెల్లంకొండ సురేష్ పై బాలయ్య కాల్పులు జరపడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది.

Telugu Balakrishna, Nagababu, Season, Unstoppable-Movie

అన్ స్టాపబుల్2 షో ద్వారా బాలయ్య ఈ ఇద్దరితో ఉన్న వివాదాలకు సంబంధించి క్లారిటీ ఇస్తే బాగుంటుందని మరి కొందరు భావిస్తున్నారు.అన్ స్టాపబుల్ సీజన్1 లా సీజన్2 కూడా ఊహించని స్థాయిలో హిట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.అన్ స్టాపబుల్ సీజన్2 కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.నాగబాబు, బెల్లంకొండ సురేష్ అన్ స్టాపబుల్ సీజన్2 కు వస్తే ఆ కిక్కే వేరని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube