స్టార్ హీరో బాలకృష్ణ సాధారణంగా సినిమాల విషయంలో జోక్యం చేసుకోరు.అయితే కథ మరీ నచ్చితే మాత్రం సినిమా విషయంలో కొన్ని సలహాలు ఇస్తుంటారు.
వీరసింహారెడ్డి సినిమాకు నేను సలహా ఇచ్చానని ఆ సలహా సినిమాకు ప్లస్ అయిందని బాలయ్య వెల్లడించగా ఆ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అఖండ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత గోపీచంద్ మలినేని ఈ కథ చెప్పారని బాలయ్య అన్నారు.
అఖండ తర్వాత తాను నటించడానికి బెస్ట్ మూవీ ఇదేనని అభిప్రాయం కలిగిందని బాలకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు.వీరసింహా రెడ్డి మూవీ అన్నాచెల్లెళ్ల అనుబంధం గురించి చెప్పే మూవీ అని అయితే చాలామంది ఈ సినిమా మాస్ సినిమా అని, ఫ్యాక్షన్ మూవీ అని అనుకుంటున్నారని బాలయ్య చెప్పుకొచ్చారు.
సినిమాలో వరలక్ష్మి పాత్ర గురించి సస్పెన్స్ మెయింటైన్ చేద్దామని నేను చెప్పానని బాలయ్య కామెంట్ చేశారు.
ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ ను చూసి మగవాళ్లు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారని బాలయ్య అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.వీరసింహారెడ్డి సినిమాలో నవరసాలు సమపాళ్లలో ఉన్నాయని బాలయ్య చెప్పుకొచ్చారు. వీరసింహారెడ్డి సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది.
సోలోగా విడుదలై ఉంటే ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగేవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వీరసింహరెడ్డి సినిమాలో ఉన్న పొలిటికల్ డైలాగ్స్ పై కొంతమంది పాజిటివ్ గా రియాక్ట్ అవుతుండగా మరి కొందరు నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు. జగన్ సర్కార్ ను టార్గెట్ చేసే విధంగా ఉన్న డైలాగ్స్ గురించి నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.బాలయ్య ఈ సినిమాలో తన నటనతో విశ్వరూపం చూపించారని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
గోపీచంద్ మలినేని మాత్రం ఈ సినిమాను మరింత బాగా తెరకెక్కించి ఉంటే బాగుండేది.