సంయుక్త మీనన్.( Samyuktha Menon ) ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఎక్కడ విన్నా కూడా ఈమె గురించే చర్చ.
విరూపాక్ష సినిమాకు హీరో అయినా హీరోయిన్ అయినా కూడా సంయుక్త మీనన్ అంటూ అందరు ప్రశంసిస్తున్నారు.సాయి ధరమ్ తేజ్ పాత్రా అంతగా లేకపోయినా తన మేరకు తాను బాగానే లాగించాడు.
కానీ సినిమా చూసి బయటకు వచ్చిన ప్రేక్షకుడికి మాత్రం కేవలం సంయుక్త మాత్రమే గుర్తు ఉంటుంది.అంతలా తన మెస్మరైసింగ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది.
పైగా ఈ సినిమా క్లైమాక్స్ అంత కూడా సంయుక్త వల్లనే హైలెట్ అయ్యింది అని చెప్పుకోవచ్చు.కొంత మంది అయితే హీరో లేకుండా కూడా ఈ సినిమాను అచ్చు ఇలాగే తీయచ్చు అంటూ సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) పాత్రపై పెదవి విరుస్తున్నారు.
దర్శకుడు తన కథకు ఏం కావాలో అది బాగానే తీసుకున్నాడు.అందువల్లనే హీరోయిన్ పాత్రా అంత చక్కగా కుదిరింది.ఇక సంయుక్త ప్రస్తుతం టాలీవుడ్ లో సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు.ఆమె మొదటి సినిమా తెలుగు లో భీమ్లా నాయక్( Bheemla Nayak ) కాగా ఈ సినిమా మంచి విజయం సాధించింది.
ఆ తర్వాత బింబి సారా లో మంచి పాత్రా దొరికింది సంయుక్త కి.ముచ్చటగా మూడో సినిమ ధనుష్ తో కలిసి సార్ చేయగా అది కూడా అద్భుతమైన విజయం సాధించింది.ఇప్పుడు విరూపాక్ష సినిమా.నాలుగు వరస హిట్లు పడటం తో సంయుక్త ఉంటె చాలు సినిమ హిట్ అనే టాక్ అంతటా వినిపిస్తుంది.ఆమె తెలుగు ఇండస్ట్రీ కి వచ్చిన లక్కీ చార్మ్ అని కూడా అనుకుంటున్నారు.
పైగా నటనకు స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ఆమె వరస విజయాలు సాధించడం పట్ల సర్వత్రా హర్షధ్వనులు వినిపిస్తున్నాయి.ఒక తెలుగు దర్శకుడి అండతోనే మొదట్లో హీరోయిన్ గా అవకాశాలు సాధిస్తుంది అంటూ సోషల్ మీడియా కోడై కూసిన ప్రస్తుతం ఆమె సినిమాలను చూసి అందరు నోరెళ్లబెడుతున్నారు.మొత్తానికి ఈ 27 ఏళ్ళ మలయాళీ ఈ ఏడాది 3 సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉంది.
మొదట వాతి సినిమా అంటే తెలుగు లో సర్ తో బంపర్ హిట్ కొట్టింది.ఆ తర్వాత బూమేరాంగ్ అనే మలయాళీ సినిమాలో కనిపించింది.ఇప్పుడు విరూపాక్ష సినిమా( Virupaksha )తో అదరగొట్టింది.మరికొద్ది రోజుల్లో కళ్యాణ్ రామ్ తో డెవిల్( Devil ) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.