ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య ( Vaishnavi Chaitanya )హీరోయిన్ గా సాయి రాజేష్ దర్శకత్వం లో రూపొందిన బేబీ సినిమా( Baby movie ) విడుదల అయి వారాలు గడుస్తున్నా కూడా జోరు మాత్రం తగ్గడం లేదు.రెండు వారాల తర్వాత బ్రో సినిమా వచ్చింది.
అప్పటి నుండి బేబీ కనిపించక పోవచ్చు అని అంతా భావించారు.బ్రో సినిమా( Bro movie ) భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం లో విఫలం అయింది.
కనుక సాయి రాజేష్ బేబీ కుమ్మేస్తూనే ఉంది.ఒక వైపు బ్రో సినిమా బాగా ఆడుతూ ఉన్నా కూడా బేబీ సినిమాకు జనాలు ఎగబడటం ఆశ్చర్యాన్ని కలిగించింది.
విడుదల అయిన మూడవ వారం అది కూడా ఒక వైపు బ్రో సినిమా ఉండగా విచిత్రంగా బేబీ సినిమాకు హౌస్ ఫుల్ కలెక్షన్స్ నమోదు అయ్యాయి.ఈ సినిమా బ్రో వల్ల వంద కోట్ల క్లబ్ లో చేరే అవకాశం లేదని అప్పుడు చర్చించుకున్నాం.కానీ ఇప్పుడు ఎవరు ఉన్నా.ఏ సినిమా వచ్చినా కూడా బేబీ సినిమా వంద కోట్ల వసూళ్లు నమోదు చేయడం ఖాయం అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
భారీ ఎత్తున వసూళ్లు రాబడుతున్న బేబీ సినిమా ను పొగడ్తలతో ముంచెత్తుతు తాజాగా చిరంజీవి( Chiranjeevi ) మీడియా సమావేశంలో మాట్లాడటం జరిగింది.దాంతో సినిమాకు మరో వారం పది రోజుల పాటు భారీ వసూళ్లు నమోదు అవుతాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
80 నుండి 90 కోట్ల మధ్య వసూళ్లు ఉంటాయి అనుకుంటూ ఉండగా ఇప్పుడు చిరంజీవి ఎంట్రీ ఇచ్చి ఆహా బేబీ ఓహో బేబీ అంటూ పొగడటం తో వంద కోట్ల కు చేరువ అవ్వడం మాత్రమే కాకుండా అంతకు మించి వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియా లో బేబీ సందడి కొనసాగుతూనే ఉంది.కనుక మరి కొన్ని రోజులు వసూళ్లు సాధించి వంద కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.