భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తయిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో గతేడాది నుంచి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
గడిచిన 75 ఏళ్ల కాలంలో భారతదేశం సాధించిన రాజకీయ, సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక పురోగతిని ఓ ఉత్సవంలా జరుపుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.దీనిలో భాగంగా 12 మార్చి 2021 నుంచి 2022 ఆగస్టు 15 వరకు మొత్తం 75 వారాల పాటు ‘‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’’ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
భారత్‌లోని మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలతో పాటు వివిధ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలోనూ ఈ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో న్యూయార్క్‌లోని ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకలను ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త స్వామి అవదేశానంద గిరి శనివారం ప్రారంభించారు.
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (ఎఫ్ఐఏ) ఆఫీస్ బేరర్ల సమక్షంలో స్వామిజీ.ఈవెంట్‌ల పోస్టర్‌లను ఆవిష్కరించారు.
న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లోని ఇండియన్ కమ్యూనిటీ నేత ప్రేమ్ భండారీ నివాసంలో ఈ ఈ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎఫ్ఐఏ అధ్యక్షుడు కెన్నీ దేశాయ్, ఛైర్మన్ అంకుర్ వైద్య, ఎఫ్ఐఏ మాజీ అధ్యక్షుడు అలోక్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అంకుర్ వైద్య మాట్లాడుతూ.ఎఫ్ఐఏ, దాని వాలంటీర్లు ఈ ఏడాది ఆగస్టులో న్యూయార్క్‌లో 2000 డమ్‌రూస్ ఆడి ప్రపంచ రికార్డును నెలకొల్పేందుకు సిద్ధంగా వున్నారని చెప్పారు.అలాగే ఔట్‌డోర్ ఈవెంట్‌లో అత్యధిక సంఖ్యలో జెండాలు ఎగురవేసినందుకు గాను ఆస్ట్రేలియా ప్రభుత్వం పేరిట గిన్నిస్ వరల్డ్ రికార్డు వుందని.దీనిని బద్ధలు కొట్టేందుకు ఎఫ్ఐఏ సిద్ధంగా వుందని వైద్య చెప్పారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జ్ఞాపకార్థం 190 అడుగుల పొడవైన త్రివర్ణ పతాకాన్ని ఆగస్టు 15న మాన్‌హట్టన్ స్కైస్‌లో విమానం సాయంతో ఎగురవేస్తామన్నారు.ఈ సందర్భంగా స్వామి అవదేశానంద గిరి మాట్లాడుతూ.
మాన్‌హట్టన్ స్కైలైన్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం ద్వారా ప్రపంచంలో భారతదేశ స్థానం ఏంటో తెలుస్తుందని వ్యాఖ్యానించారు.