ఒక్కో కాంబో మనం తెరమీద చుస్తే ఇంకా ఇంకా చూడాలని అనిపిస్తుంది.ఆ కాంబోకి మంచి క్రేజ్ కూడా ఏర్పడుతుంది.
హీరో – డైరెక్టర్, హీరో – హీరోయిన్, హీరో – క్యారెక్టర్ ఆర్టిస్టు.ఇలా ఏ కాంబో అయినా ఉండవచ్చు.
అలా మన టాలీవుడ్ లో మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపించే కాంబో.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – ఆలీ కాంబో.
వీరిద్దరూ కూడా చాలా సినిమాల్లో కలిసి ట్రావెల్ చేసారు.
పవన్ కళ్యాణ్ తన కెరీర్ స్టార్టింగ్ నుండి ఆలీ లేకుండా సినిమా చేయలేదు.
అయితే ఇటీవల కాలంలో పవన్ సినిమాల్లో ఆలీని చూడలేక పోతున్నాం.అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఆలీ కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు.
వీరిద్దరిది ఎవర్ గ్రీన్ కాంబో అనే చెప్పాలి.వీరిద్దరూ కలిసి ఎన్నో సీన్స్ ను పండించారు.
ఆలీతో కలిసి పవన్ కళ్యాణ్ చేసిన కామెడీ హైలెట్ గా నిలిచేది.
మరి కారణాలు తెలియవు కానీ వీరి కాంబో మాత్రం ఇప్పుడు రావడం లేదు.
అయితే ఇక ముందు వీరి కాంబోను చూడవచ్చు అని క్లారిటీ ఇచ్చారు.ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అలీతో జాలీగా షోలో అలీ తాజాగా ఈ విషయాన్నీ చెప్పుకొచ్చాడు.
సమ్మతమే టీమ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మరియు హీరోయిన్ చాందిని చౌదరి లతో మాట్లాడుతూ.త్వరలోనే మా కాంబో సిల్వర్ స్క్రీన్ పై మళ్ళీ కనిపిస్తుంది అంటూ ఈయన అఫిషియల్ గా చెప్పుకొచ్చాడు.మరి ఈ కాంబో ఎప్పుడు ఎలా ఉంటుందో చూడాలి.వీరిద్దరి కోసం ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.ఇక ప్రెసెంట్ పవన్ సినిమాల విషయానికి వస్తే.హరిహర వీరమల్లు సినిమా సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది.
ప్రెసెంట్ పవన్ షూటింగ్ కు కొద్దిగా గ్యాప్ ఇచ్చి రాజకీయాలపై ద్రుష్టి పెట్టాడు.