నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది.కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో ఓ మహిళపై గుర్తు తెలియని యువకుడు కత్తితో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.
సదరు మహిళ ఆటోలో వెళ్తుండగా బయటకు లాగి దాడి చేశాడు దుండగుడు.బాధితురాలు కేకలు వేయడంతో యువకుడు పరారైనట్లు స్థానికులు చెబుతున్నారు.
మహిళకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు లేగుంటపాడుకు చెందిన సురేశ్ గా గుర్తించారు.
దాడికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.