నల్లగొండ జిల్లా:నల్లగొండ జిల్లాలో గణేష్ ఉత్సవాల నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికల హడావుడి మొదలైంది.సర్పంచ్ గిరిని ఆశిస్తున్న ఆశావహులు వినాయకుడి విగ్రహలు భారీ సంఖ్యలో ఇప్పియ్యడమే కాకుండా, గణేష్ మండపాల వద్ద అన్నదానాలు ఏర్పాటు చేయడం,ఉత్సవ కమిటీలకు భారీగా చందాలు రాయడం చేశారు.
ఇదంతా ఒక ఎత్తయితే ప్రభుత్వం కులగణన చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తుండడంతో గత రిజర్వేషన్లు తప్పక మారుతాయని తెలుస్తుంది.దీంతో సర్పంచ్ గిరిని ఆశిస్తున్న ఆశావహులు అయోమయంలో పడ్డట్టు తెలుస్తుంది.
గణేష్ ఉత్సవాలకు భారీగా ఖర్చు పెట్టిన అభ్యర్ధులను గెలిపిస్తారా లేక పార్టీ అభ్యర్ధులను చూసి ఓటేస్తారా లేక అభ్యర్థి గుణగణాలను చూసి ఓటేస్తారా అనే విషయాలపై పబ్లిక్ పల్స్ మాత్రం వేరేగా ఉంది.గణేష్ ఉత్సవాలకు ఎన్నికలకు సంబంధం లేదని,గతం నుండి ప్రజా సేవ చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడినే సర్పంచ్ గా ఎన్నుకుంటామని,లోకల్ ఎన్నికలు కాబట్టి పార్టీని చూడమని వారంటున్నారు.
ఏదేమైనా సర్పంచ్ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేనట్టుగానే కన్పిస్తున్న తరుణంలో ఇప్పటి వరకు ఎన్నో ఆశలు పెట్టుకొని భారీగా డబ్బు ఖర్చు చేసిన ఆశావహులు ఆశలు నెరవేరేనా లేక గణేష్ నిమజ్జనంలో అవి గంగలో కలిసినా అనేది వెయ్యి డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.