ఏపీలో బీజేపీ, టీడీపీ( BJP , TDP )లతో పొత్తు పెట్టుకున్న బీజేపీ పొత్తులో భాగంగా 10 అసెంబ్లీ, ఆరు లోక సభ స్థానాలను తీసుకుంది.తాము పోటీ చేయబోతున్న ఆరు లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన పూర్తి చేసింది.
అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను త్వరలోనే ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.ఇప్పటికే అభ్యర్థుల జాబితాను ఫైనల్ చేసే విషయంలో బిజెపి అగ్ర నాయకులతోను పురందరేశ్వరి( Daggubati Purandeswari) చర్చలు జరిపారు.
ఇక పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారం పైనే పురందరేశ్వరి నిమగ్నం అయ్యారు ఈ మేరకు ఈ రోజు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారం ఏ విధంగా చేపట్టాలి.
జనాల్లోకి ఏ విధంగా వెళ్లాలి.ఎక్కడెక్కడ బహిరంగ సభలు నిర్వహించాలి.
ఎవరిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించాలి ఇలా అనేక అంశాలపై పార్టీ నాయకులతో చర్చిస్తున్నారు.నేడో, రేపు పూర్తిస్థాయిలో అసెంబ్లీ అభ్యర్థుల జాబితా కూడా పూర్తి చేసి ఎన్నికల ప్రచారంపైనే ఫోకస్ చేయనున్నారు.
వచ్చేనెల 5వ తేదీ నుంచి బిజెపి( BJP ) పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే విధంగా సన్నాహాలు చేస్తున్నారు.పురందరేశ్వరి రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేయబోతూ ఉండడం తో అక్కడి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్నారు.ఏపీలో త్వరలో బిజెపి చేపట్టబోయే ఎన్నికల ప్రచారంకు బిజెపి అగ్ర నేతలు హాజరయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు.కేంద్ర మంత్రులు, జాతీయ నేతల షెడ్యూల్ కు అనుగుణంగా ఏపీలో సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అలాగే టిడిపి ,జనసేనతోనూ ఉమ్మడిగా నిర్వహించే సభల పైన ఆయా పార్టీలతో పురందరేశ్వరి చర్చిస్తున్నారు.రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పూర్తిగా ఎన్నికల ప్రచారం చేపట్టి , రాష్ట్రవ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించే విధంగా పురంద్రేశ్వరి షెడ్యూల్ రూపొందించే పనిలో నిమగ్నం అయ్యారు.