ఏపీ బిజెపి అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దగ్గుబాటి పురందరేశ్వరి( Daggubati Purandeswari ) తన మార్క్ ఏంటో చూపించారు.ముఖ్యంగా పార్టీలో తనకు వ్యతిరేకవర్గంగా ఉన్నవారిని మెల్లిమెల్లిగా పక్కన పెట్టారు.అంతే కాదు ఇటీవల ప్రకటించిన బిజెపి అభ్యర్థుల జాబితాలో ఎవరికి సీటు దక్కకుండా చక్రం తిప్పడంలో సక్సెస్ అయ్యారు.2019 ఎన్నికల తర్వాత టిడిపి, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నా కలిసి ఎక్కడా పోరాటాలు చేసింది లేదు.ముఖ్యంగా అప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు( AP BJP President Somu Veerraju ) జనసేన విషయంలో సానుకూలంగా లేకపోవడం, అధికార పార్టీ వైసీపీకి అనుకూలంగా సోము వీర్రాజు వ్యవహరిస్తున్నారని ఎన్నో విమర్శలు వచ్చాయి.సోము వీర్రాజు వైఖరి కారణంగానే జనసేన కూడా బిజెపితో కలిసి ముందుకు వెళ్లే విషయంలో అంత ఆసక్తి చూపించలేదు.
కానీ పురందరేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత సీన్ పూర్తిగా మారిపోయింది.
బిజెపి, జనసేన, టిడిపి పొత్తు( BJP Janasena TDP Alliance ) పెట్టుకునే విషయంలో ఆమె కీలకంగానే వ్యవహరించారు.ప్రస్తుతం పురందరేశ్వరి వ్యతిరేక బ్యాచ్ అంతా సైలెంట్ అయిపోయింది.ఆమె ఏపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ, అధికార పార్టీ వైసీపీని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తూనే వచ్చారు.
పొత్తుల వ్యవహారం పార్టీ అధిష్టానం చూసుకుంటుందని, తాము పార్టీని బలోపేతం చేసినందుకే కృషి చేస్తున్నామంటూ పురందరేశ్వరి చెప్పుకుంటూ వచ్చారు.పాత బిజెపి నాయకులు ఎవరు ఆమెకు సహకరించకపోయినా, అవేమి పట్టించుకోకుండా ముందుకు వెళ్లి కేంద్ర బిజెపి పెద్దలు( BJP Leaders ) సూచనలతో ముందడుగు వేశారు.
ప్రస్తుతం బిజెపి తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితా చూసుకున్నా పురందరేశ్వరి వ్యతిరేక బ్యాచ్ కు చెక్ పెట్టినట్లే కనిపిస్తోంది.సోము వీర్రాజు పోటీ చేసేందుకు నియోజకవర్గమే లేదు. రాజమండ్రి( Rajahmundry ) ఎంపీగా పోటీ చేయాలని ఆయన భావించినా, అక్కడి నుంచి పురందరేశ్వరి పోటీ చేస్తున్నారు.అనపర్తి నుంచి పోటీ చేయాలని అధినాయకత్వం సోము వీర్రాజు కి సూచించినా అక్కడి నుంచి ఆయన పోటీ చేసేందుకు ఆసక్తి చూపించలేదట.
దీంతో ఆయనకు ఎక్కడా స్థానం లేకుండా పోయింది.అలాగే బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు( BJP GVL Narasimha Rao ) గత మూడేళ్లుగా విశాఖలోనే ఉంటూ, అక్కడ నుంచి పోటీ చేసేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు.
కానీ అక్కడ టిడిపి తమ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిని ప్రకటించింది.దీంతో జివిఎల్ కు పోటీ చేసినందుకు ఎక్కడా స్థానమే లేదు.
అలాగే బిజెపి ఏపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి( BJP Vishnuvardhan Reddy ) హిందూపురం ఎంపీగా పోటీ చేయాలని భావించారు.లేకపోతే కదిరి అసెంబ్లీ నుంచైనా పోటీ చేయాలని చూశారు.కానీ ఆ రెండు స్థానాల్లోను టిడిపి తమ అభ్యర్థులను ప్రకటించింది.దీంతో విష్ణు కూడా పోటీ చేసేందుకు అవకాశం లేకుండా పోయింది.ఈ విధంగా పురందరేశ్వరి వ్యతిరేక బ్యాచ్ అందరికి ఈ ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో, ఆమె ఈ విషయంలో పైచే సాధించినట్లుగానే కనిపిస్తున్నారు.