Manish Chauhan : కూలి పనులు చేస్తూ నాలుగు బ్యాంక్ ఉద్యోగాలు.. మనీష్ చౌహాన్ సక్సెస్ స్టోరీకి ఫిదా అవ్వాల్సిందే!

ప్రస్తుత కాలంలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగాల( Government Jobs ) కొరకు ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతున్నారు.గవర్నమెంట్ జాబ్ సాధిస్తే లైఫ్ సెటిల్ అయిపోయినట్టేనని ఆ తర్వాత జీవితాంతం ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని చాలామంది ఫీలవుతారు.

 Manish Chauhan Four Government Bank Jobs Inspirational Success Story Details-TeluguStop.com

అయితే ఒక వ్యక్తి కూలి పనులు చేసుకుంటూనే కోచింగ్ కూడా తీసుకోకుండా నాలుగు బ్యాంక్ ఉద్యోగాలను సాధించడం జరిగింది.నాలుగు ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగాలను సాధించిన ఈ వ్యక్తి సక్సెస్ స్టోరీ నెట్టింట వైరల్ అవుతోంది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని( Madhya Pradesh ) బుర్హాన్ పూర్ మనీష్ చౌహాన్ స్వస్థలం కాగా మనీష్ తండ్రి సురేష్ కూలి పనులు చేస్తూ జీవనం సాగించేవారు.కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు, ఇతర సమస్యలు ఉన్నా కొడుకును ఉన్నత చదువులు చదివించాలని ఇతని పేరెంట్స్ భావించారు.

బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీఈడీ చదివిన మనీష్ ఆ తర్వాత బ్యాంక జాబ్స్ పై( Bank Jobs ) ఫోకస్ పెట్టారు.

Telugu Bank Jobs, Madhya Pradesh, Madhyapradesh, Manish Chauhan, Manishchauhan-I

కోచింగ్ తీసుకోవాలనే కోరిక ఉన్నా కోచింగ్ తీసుకుంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి ఉండటంతో ఆ మొత్తం కుటుంబానికి అదనపు భారం అవుతుందని మనీష్ చౌహాన్( Manish Chauhan ) భావించారు.అయితే ఇంటి నుంచి ప్రిపేర్ అయిన మనీష్ కు సులువుగా సక్సెస్ దక్కలేదు.తొలి రెండు ప్రయత్నాల్లో అతనికి ఆశించిన ఫలితాలు రాలేదు.

మూడో ప్రయత్నంలో మాత్రం మనీష్ నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.

Telugu Bank Jobs, Madhya Pradesh, Madhyapradesh, Manish Chauhan, Manishchauhan-I

కన్న కలను నెరవేర్చుకున్న మనీష్ ప్రస్తుతం మధ్యప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్నారు.కోచింగ్ లేకుండా సక్సెస్ అయిన మనీష్ చౌహాన్ నేటి యువతకు స్పూర్తి అని చెప్పడంలో సందేహం అవసరం లేదు.మనీష్ చౌహాన్ కు ఉద్యోగం రావడంతో అతని కుటుంబ ఆర్థిక కష్టాలు సైతం తీరినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంతో మనీష్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube