విజయవాడ: పోలవరం పై సోము వీర్రాజు కామెంట్స్.పోలవరం అంశాన్ని వివాదం చేసే కుట్ర జరుగుతుంది.పోలవరం ప్రాజెక్టు ఎత్తు గురించి టిఆర్.యస్ నాయకులు మాట్లాడుతున్నారు.పోలవరం ను ప్రశ్నిస్తే… తెలంగాణ ఏర్పాటు ను ప్రశ్నించి నట్లే.రాష్ట్ర విభజన అంశాన్ని తిరగ తోడినట్లే.రాష్ట్ర విభజన బిల్లు ప్రకారం పోలవరం నిర్మాణం చేయాలి.1960లో పోలవరం ముంపు మండలాలను ఖమ్మంలో కలిపారు.విభజన తరువాత భద్రాచలం టెంపుల్ ను, మరో రెండు మండలాలు తెలంగాణకు ఇచ్చారు.దుమ్మగూడెం ప్రాజెక్టు ద్వారా నాగార్జున సాగర్ కు నీరు ఇవ్వాలని వైయస్ పనులు చేపట్టారు.
దుమ్ముగూడెం వాళ్లకు ఇవ్వడం వల్ల రాయలసీమ తీవ్రంగా నష్టపోయింది.రాష్ట్ర విభజన పై పూర్తిగా అధ్యయనం చేసిన ఏకైక పార్టీ బిజెపి.
పోలవరం వద్దని నాడు టిడిపి వరంగల్ మహిళా నేత మాట్లాడారు.నేడు మా పార్టీ లో ఉన్న ఇద్దరు నాయకులు అప్పుడు టిడిపిలో ఉన్నారు.
వారిద్దరూ నాడు ఆమె వ్యాఖ్యలు ను కనీసం ఖండించలేదు.ఆ తరువాత చంద్రబాబు పోలవరం సోమవారం అని ఆర్భాటం చేశారు.
పోలవరంను వ్యతిరేకిస్తే… విభజన చట్టాన్ని ఒప్పుకోనట్లే.అప్పుడొక మాట…ఇప్పుడొక మాట అనేది కరెక్ట్ కాదు.
పోలవరం ముంపు ప్రాంతాల లలో కొన్ని గ్రామాల ప్రజలు తెలంగాణ కలుస్తాం అంటున్నారు.వారంతా భద్రాచలం మీద ఆధార పడటం వల్ల అటు చూస్తున్నారు.
విలీనం చేసిన మండలాల్లో సిపిఎం ఆందోళన చేయడం ఏమిటి.
ఏం మాయ రోగం వచ్చింది… టి.ఆర్.యస్ తో లాలూచి పడి రోడ్డెక్కారా.వారికి అన్నీ తెలిసి కూడా ఇలా చేస్తారా.పోలవరం విషయంలో జగన్ ప్రజలను మోసం చేస్తున్నారు.గతంలొ చంద్రబాబు కూడా ఇలానే ప్రకటించి దెబ్బ తిన్నారు.షెకావత్ ఎపి పర్యటన తరువాత 15రోజులకొక సారి రివ్యూ చేస్తున్నారు.
లోయర్ కాపర్ డ్యాం పాడైన విషయం పై అధ్యయనం జరుగుతుంది.చంద్రబాబు అనేక అవినీతి చేశారని జగన్ ప్రచారం చేశారు.
మూడేళ్లలో వాటిని బయట పెట్టి ఎందుకు చర్యలు తీసుకోలేదు.పోలవరం నిర్మాణం కేంద్రం పూర్తి చేస్తుంది.
ఎపి లో పరిణామాలను మా జాతీయ నాయకత్వానికి వివరిస్తాం.కేశినేని నాని వ్యాఖ్యలు పై స్పందించిన సోము వీర్రాజు.
భవిష్యత్తులో జరగబోయే అంశాలను ఇప్పుడే చెప్పేస్తామా.