పార్టీ త‌ర్వాతే ఎవ‌రైనా..! మ‌రి కోమ‌టి రెడ్డి తీరు అందుకు భిన్నంగా...!!

సాధార‌ణంగా రాజ‌కీయాల్లో గుర్తింపు రావాలంటే పార్టీ అవ‌స‌రం.వ్య‌క్తిగ‌తంగా ఎంత ఆక‌ట్టుకున్నా.

 Anyone After The Party..! And Komati Reddy's Style Is Different.  Komatireddy Ve-TeluguStop.com

పార్టీ లేకుండా ఏమీ చేయ‌లేము.ముందు పార్టీ త‌ర్వాతే వ్య‌క్తిగా కొన‌సాగుతారు.

ఎంతో మంది వ్య‌క్తుల‌కంటే పార్టీపై అభిమానంతో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తారు.ఓట‌ర్లు కూడా పార్టీ మీద అభిమానంతో ఓట్లేస్తారు.

అయితే ఎవ‌రైనా పార్టీ త‌ర్వాతే.పార్టీయే మెయిన్.

కానీ నా త‌ర్వాతే పార్టీ అనుకుంటే తేడాలొచ్చేస్తాయి.పార్టీలో ఉంటూ గుర్తింపు తెచ్చుకుని నా వ‌ల్లే పార్టీకి పేరు వ‌చ్చింద‌నుకుంటే.

అదిపొర‌పాటే అవుతోంది.ఇదిలా ఉంటూ న‌ల్ల‌గొండ కాంగ్రెస్ కంచుకోట‌గా చెప్పుకుంటారు.

ఇక్క‌డ కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ఎంత‌లా ప్ర‌భావితం చేస్తారో అంద‌రికీ తెలిసిందే.అయితే ఇటీవ‌ల కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే ప‌ద‌వికీ రాజీన‌మా చేయ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మ‌రిన విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో ఎన్నో ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఇటీవ‌ల పీసీసీ చీఫ్ రేవంత్, కాంగ్రెస్ నేత‌లూ కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ పై ఘాటుగా విమ‌ర్శ‌లు చేశారు.

ఈ నేప‌థ్యంలోనే పార్టీ సీనియ‌ర్ నేత ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి తానే గొప్ప‌ని.పార్టీకే తాను న‌ల్ల‌గొండ‌లో గుర్తింపు తెచ్చాను అన్న‌ట్లు మాట్లాడ‌టం.

తాను ప్ర‌చారం చేస్తేనే మునుగోడులో గెలుపు సాధ్యం అని చెప్ప‌డంపై రాజ‌కీయ విశ్లేష‌క‌లు ప‌లు కామెంట్స్ చేస్తున్నారు.కాంగ్రెస్ లో వెంక‌ట్ రెడ్డి ముప్పయి నాలుగేళ్ల సర్వీస‌ట‌.

కాంగ్రెస్ లో ఆయనే బిగ్ లీడరట.మునుగోడులో త‌ను ప్రచారం చేస్తేనే కాంగ్రెస్ కి ఓట్లు వస్తాయి… ఆ పార్టీ గెలుస్తుంది అని ఆయన చెబుతున్నారు.

నిజానికి కాంగ్రెస్ ఒక మహా సంస్థ.ఆ పార్టీలో అందరూ ఉంటేనే గెలుపు అయినా ఏదైనా సాధ్యపడేది.

ఈ కోమటి రెడ్డి బ్రదర్స్ కి ఈ రోజు బ్రాండ్ ఇమేజ్ వచ్చింది అంటే అది కాంగ్రెస్ వల్లనే అన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామెంట్స్ కూడా నిజ‌మ‌నే చెప్ప‌వ‌చ్చు.

పార్టీకి మించి తాను అన్న‌ట్లుగా

Telugu Congress, Komatireddy, Komativenkat, Munugodu-Political

ఇక మునుగోడు ఉప ఎన్నిక దగ్గరలోనే ఉంది.ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది.ఈ నేపథ్యంలో కోమటి రెడ్డి ఇలాకాలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు త‌ప్ప‌నిస‌రి.

ఆ దిశగా అంతా సమ‌ష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది.అయితే కోమటి రెడ్డి వెంకట రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు.

తాను ప్రచారం చేస్తేనే గెలుపు అని అంటున్నారు.తాను వస్తేనే మునుగోడు లో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని అంటున్నారు.

తాను కాకుండా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అక్కడ ప్రచారం చేస్తే మూడు వందల ఓట్లు కూడా రావని మాట్లాడ‌తున్నారు.నాలుగు పార్టీలు మారి వచ్చిన వ్యక్తి కింద పనిచేయడమా.

అని దిక్క‌రిస్తున్నారు.

అయితే రేవంత్ ని కాంగ్రెస్ అధిష్టానం నియ‌మించ‌గా అందుకు అంద‌రూ క‌ట్టుబ‌డి ఉండాలి.

ఎంత గొప్ప‌వారైనా పార్టీలో కొన‌సాగుతున్న‌ప్పుడు పార్టీకి అనుగుణంగా ప‌నిచేయాలి.పార్టీ అధిష్టానం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా పీసీసీ చీఫ్ స్థానంలో ఎవ‌రున్నా ప‌నిచేయాల్సిందే.

కానీ పార్టీ కంటే తాను ఎక్కువ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుకుంటున్నారా.అన్న‌ది ప్ర‌శ్న‌.

అందుకే ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నారా.అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

అలాగే పార్టీలో కీలక నేత అద్దంకి దయాకర్ ని సస్పెండ్ చేస్తే తప్ప తాను ప్రచారానికి రాన‌ని తేల్చి చెప్తున్నారు.మొత్తానికి త‌ను అన్న‌ది జ‌ర‌గాల‌ని పూర్తిగా వ్యక్తిగ‌తంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.

పార్టీని మించి తాను అనుకుంటే.చివ‌ర‌కు ఏమ‌వుతుందో అంద‌రికీ తెలిసిందే.

ఇక మునుగోడు ఉప ఎన్నిక ఎలాంటి స‌మాధానం చెప్తుందో వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube