మంచి వాడిని దూరం చేసుకుంటే.. ముంచేవాడే దగ్గరవుతారు: నాగబాబు

వెండితెర పై పలు సినిమాలలో నటుడిగా నటించి అనంతరం బుల్లితెర కార్యక్రమాలలో ప్రేక్షకులను సందడి చేస్తున్న నటుడు నాగబాబు గురించి తెలిసింది.ఈయన నటుడిగా నిర్మాతక ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

 If You Keep A Good Person Away A Sinker Will Come Near Nagababu , Nagababu , Tol-TeluguStop.com

ఇకపోతే ప్రస్తుతం ఈయన జనసేన పార్టీ తరఫున పెద్ద ఎత్తున పార్టీని ప్రజలలోకి తీసుకు వెళ్తూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.అయితే ఈ మధ్యకాలంలో నాగబాబు సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ఈయన ఆ పరోక్షంగా ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ పోస్టులు చేయడంతో ప్రస్తుతం ఇవి చర్చనీయాంశంగా మారాయి.గత రెండు రోజుల క్రితం నాగబాబు తాను సామాన్యంగా ఎవరిని దూరం చేసుకోనని ఒకవేళ దూరమైతే వాడంత పెద్ద ఎదవ ఉండరంటూ పోస్ట్ చేశారు.

అయితే ఈ పోస్ట్ తన సన్నిహితుల కోసం చేసి ఉంటారని తన సన్నిహితులు దూరం కావటం వల్లే ఇలాంటి పోస్ట్ చేశారని అందరూ భావించారు.

తాజాగా మరొక కొటేషన్ ద్వారా నాగబాబు సోషల్ మీడియా వార్తల్లో నిలిచారు.తాజాగా ఈయన తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ మంచివాడు శత్రువు కైనా సహాయం చేస్తాడు చెడ్డవాడు తోడు పుట్టిన వాడికైనా ద్రోహం చేస్తాడు అంటూ కొటేషన్ చేసేసారు.మంచి వాడిని దూరం చేసుకుంటే.

ముంచేవాళ్లే దొరుకుతారు అంటూ ఈయన షేర్ చేసిన ఈ కొటేషన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే నాగబాబు ఎవరిని ఉద్దేశించి ఇలాంటి పోస్ట్ చేశారు అంటూ సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.

ఈ క్రమంలోనే కొందరు వైసిపి నేతలను టార్గెట్ చేశారని భావించగా మరికొందరు తన అన్నయ్య చిరంజీవిని టార్గెట్ చేస్తూ ఇలాంటి కామెంట్ చేశారని భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube