నిజామాబాద్ జిల్లా తెలంగాణ యూనివర్సిటీలో మరో వివాదం రాజుకుంది.పాలకమండలిని రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
కాగా ఫిబ్రవరి 27వ తేదీనే పాలకమండలి రద్దు అయినప్పటికీ పాలక వర్గం ఆ విషయాన్ని గోప్యంగా ఉంచిందని తెలుస్తోంది.ఈ క్రమంలో ఈసీ సమావేశాలు ఎలా నిర్వహించారని పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పాలకమండలి రద్దు అయినప్పటీ నుంచి ఇప్పటివరకు మొత్తం ఏడు సార్లు సమావేశాలు నిర్వహించడంపై వెల్లువెత్తుతున్న విమర్శలతో మరో వివాదం తలెత్తింది.