యంగ్ హీరో సంతోష్ శోభన్ ( Santosh Sobhan )హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”అన్నీ మంచి శకునములే” (Anni Manchi Sakunamule).ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి (Nandini Reddy) దర్శకత్వం వహించారు.
సంతోష్ శోభన్ హీరోగా మాళవిక నాయర్ (Malavika Nair) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ప్రియాంక దత్ నిర్మించారు.
మరి ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది.దీంతో మేకర్స్ కొన్ని రోజులుగా వరుస ప్రమోషన్స్ చేస్తూ ఈ సినిమాపై ఆసక్తి కలిగేలా చేస్తున్నారు.ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో ఆడియెన్స్ కూడా ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
మరో మరో మూడు రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న రాత్రి ఘనంగా నిర్వహించారు.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగుగా ఈ ఈవెంట్ కు నాని (Nani) గెస్ట్ గా హాజరయ్యాడు.ఈ క్రమంలోనే ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అయ్యాయి.ఈయన మాట్లాడుతూ అన్ని మంచి శకునములే సినిమా సభ్యులకు అభినందనలు తెలిపారు.
ఈ సినిమా నుండి వచ్చిన పాటలు, ప్రోమోలు బాగున్నాయి అని తెలిపారు.
అలాగే సంతోష్ శోభన్ (Santosh Sobhan) ఒకప్పటి నన్ను చూస్తున్న అని ఈ సినిమా తప్పకుండ ఘన విజయం సాధిస్తుంది అని ఈ సినిమాను ఇప్పటికే ప్రేక్షకుల మదిలో రిజిస్టర్ చేసేలా స్వప్న దత్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారని.
వైజయంతీ మూవీస్ తో నేను చాలా సన్నిహితంగా ఉంటానని చెప్పుకొచ్చారు.మరి నందిని రెడ్డి ఈసారి అయిన మంచి హిట్ అందుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే.