భగవంత్ కేసరి కలెక్షన్స్ ఫేక్ అంటూ విమర్శలు... స్పందించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి !

నందమూరి నట సింహం బాలకృష్ణ ( Balakrishna ) తాజాగా భగవంత్ కేసరి( Bhagavanth kesari ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19వ తేదీ విడుదలైన విషయం మనకు తెలిసిందే.

 Anil Ravipudi Reacts On Bhagavanth Kesari Collections, Bhagavanth Kesari , A-TeluguStop.com

ఇలా తండ్రి కూతురు సెంటిమెంట్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందు వచ్చిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది ఇక బాలయ్య అనిల్ రావిపూడి కెరియర్ లోనే ఈ సినిమా కూడా బెస్ట్ సినిమాగా నిలిచిపోయిందని చెప్పాలి.ఇక ఈ సినిమాలో బాలకృష్ణ కూతురి పాత్రలో నటి శ్రీ లీల( Sreeleela ) నటించిన విషయం మనకు తెలిసిందే.

Telugu Anil Ravipudi, Balakrishna, Kajal Aggarwal, Sreeleela, Tollywood-Movie

ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటి కాజల్ అగర్వాల్ నటించారు.ఇలా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా భారీ స్థాయిలో కలెక్షన్స్ కూడా రాబట్టాయి .అయితే ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ అన్ని ఫేక్ అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు కురిపించారు.ఈ సినిమా మొదటి వారంలోనే ఏకంగా 112 కోట్లు రాబట్టినట్లు ప్రకటించారు.

అయితే ఈ కలెక్షన్స్ అన్ని పూర్తిగా ఆవాస్తవమని మొదటి వారంలో కేవలం 70 నుంచి 80 కోట్ల వరకే కలెక్షన్స్ వచ్చాయి అంటూ కొందరు విమర్శలు కురిపించారు.అయితే ఈ విమర్శలపై తాజాగా డైరెక్టర్ అనిల్ రావిపూడి ( Anil Ravipudi ) స్పందించారు.

Telugu Anil Ravipudi, Balakrishna, Kajal Aggarwal, Sreeleela, Tollywood-Movie

ఈ సందర్భంగా అనిల్ రావిపూడి ( Anil Ravipudi ) మాట్లాడుతూ మా సినిమా గురించి మేము ప్రకటించినటువంటి కలెక్షన్స్ లో ఏ విధమైనటువంటి ఫేక్ లేదని ఇవన్నీ కూడా మేము చాలా జెన్యూన్ గానే ప్రకటిస్తున్నామని తెలియజేశారు.అయితే ఈ సినిమాకు ఈ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయా రాలేదా అన్నది ప్రేక్షకుల స్పందన బట్టి చూస్తే ప్రతి ఒక్కరికి అర్థం అవుతుందని అనిల్ రావిపూడి తెలియజేశారు. సినిమా కలెక్షన్స్ విషయంలో మేము ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేయలేదు అంటూ ఈయన వెల్లడించారు.ఇక ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం సక్సెస్ టూర్ నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube