విద్యార్ధినిపై అత్యాచారం .. భారతీయుడికి 16 ఏళ్ల జైలు శిక్ష , సింగపూర్ కోర్ట్ సంచలన తీర్పు

నాలుగేళ్ల క్రితం నాటి అత్యాచారం కేసులో 26 ఏళ్ల భారతీయ యువకుడికి 16 ఏళ్ల జైలు శిక్ష, 12 లాఠీ దెబ్బలు విధిస్తూ సింగపూర్ న్యాయస్థానం ( Singapore court )తీర్పు వెలువరించింది.అపహరణ, దొంగతనం ఆరోపణలను కూడా కోర్టు పరిగణనలోనికి తీసుకుంది.2019లో ఓ యూనివర్సిటీకి చెందిన విద్యార్ధిని అర్ధరాత్రి బస్‌స్టాప్‌కు నడుచుకుంటూ వెళ్తుండగా.ఇక్కడ క్లీనర్‌గా పనిచేస్తున్న చిన్నయ్య( chinnayya ) అనే వ్యక్తి ఆమె తప్పుడు దారి చూపించాడు.

 Indian National Sentenced To 16 Years In Jail For Raping University Student In S-TeluguStop.com

ఆపై ఆమెను కొట్టి, అటవీ ప్రాంతానికి ఈడ్చుకెళ్లి దారుణంగా అత్యాచారం చేశాడని ది టుడే వార్తాపత్రిక నివేదించింది.బాధితురాలు ముఖం, ఇతర శరీర భాగాలపై తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చేరింది.

ఆమెను స్వయంగా ప్రియుడు కూడా గుర్తించలేకపోయాడంటే నిందితుడు ఎంత కిరాతకంగా ఆమెను వేధించాడో అర్ధం చేసుకోవచ్చు.

Telugu Chinnayya, Deputypublic, Indiannational, Singapore-Telugu NRI

ఈ ఘటన మే 4, 2019న జరిగింది.అయితే కేసు విచారణ నాలుగేళ్ల పాటు సాగడానికి చిన్నయ్య మానసిక స్థితే కారణం.డిప్యూటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాయల్ పిళ్లే ( Deputy Public Prosecutor Kayal Pillay )మాట్లాడుతూ.

చిన్నయ్య బాధితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన సమయంలో ఆమె ఊపిరీ పీల్చుకోలేకపోయిందన్నారు.నిందితుడు ఆమె గొంతును గట్టిగా పట్టుకున్నాడని.ఈ సమయంలో ఇద్దరి మధ్య తీవ్ర ప్రతిఘటన జరిగిందని ప్రాసిక్యూటర్ తెలిపారు.అత్యాచారం తర్వాత ఆమె వద్ద వున్న విలువైన వస్తువులను చిన్నయ్య అపహరించాడని.

చివరికి వాటర్ బాటిల్ కూడా లాక్కొన్నాడని ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు.

Telugu Chinnayya, Deputypublic, Indiannational, Singapore-Telugu NRI

కీచక ఘటన తర్వాత విద్యార్ధిని తన బ్యాగ్ వద్దకు వెళ్లగా.అక్కడ ఆమెకు కత్తెర కనిపించింది.ఒకవేళ చిన్నయ్య మళ్లీ వెనక్కి తిరిగి వస్తాడేమోనన్న భయంతో బాధితురాలు కత్తిని చేతిలో పట్టుకుని వుందని ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఆ సమయంలో తన కళ్లద్దాలను గుర్తించలేకపోయినప్పటికీ.ఎలాగోలా మొబైల్‌ను వెతికి తన ప్రియుడికి ఫోన్ చేసి విషయం చెప్పింది.దీనిపై అతను వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విద్యార్ధిని పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ సమయంలో బాధితురాలి మెడ భాగంలో గొంతు నులిమిన గుర్తులు, గీతలు, గాయాలు వున్నట్లు వైద్యులు గుర్తించారు.ఈ కేసుకు సంబంధించి చిన్నయ్యను మే 5, 2019న అరెస్ట్ చేశారు.

విచారణ సందర్భంగా అతనికి 15 నుంచి 17 ఏళ్ల జైలు శిక్ష, 16 నుంచి 18 లాఠీ దెబ్బలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్ కోర్టును ప్రాసిక్యూటర్ కోరారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube