బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు విష్ణు ప్రియ.పోవే పోరా వంటి కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈమె అనంతరం పలు బుల్లితెర చానల్స్ లో వివిధ కార్యక్రమాల ద్వారా యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇకపోతే గత కొద్దిరోజులుగా ఈమె బుల్లితెర కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు.ఇలా బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉండేది.
ఇలా సోషల్ మీడియా వేదికగా తరచూ తనకు సంబంధించిన విషయాలను డాన్స్ రీల్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసేవారు.ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం విష్ణు ప్రియ తన తల్లిగారు మరణించిన విషయం మనకు తెలిసిందే.
విష్ణు ప్రియ తన ఇంస్టాగ్రామ్ ద్వారా తరచూ తన తల్లిని తన చెల్లిని కూడా అభిమానులకు పరిచయం చేస్తూ ఉండేవారు అయితే అకస్మాత్తుగా ఈమె జనవరి 26వ తేదీ మరణించడంతో విష్ణు ప్రియ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ తన తల్లి మరణించిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.ఈ విధంగా తన తల్లి మరణించినప్పటి నుంచి ఈమె సోషల్ మీడియాకి కూడా కాస్త దూరంగా ఉంటున్నారు.అయితే తాజాగా మరోసారి విష్ణు ప్రియ తన తల్లిని తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.
తన తల్లి మరణ వార్త నుంచి ఇంకా బయటపడనటువంటి విష్ణు ప్రియ తన తల్లిని తలుచుకుంటూ ఎంతో కుమిలిపోతున్నట్టు తెలుస్తుంది.అయితే తాజాగా తన తల్లి పుట్టిన రోజు కావడంతో ఈమె తన తల్లి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.అమ్మ హ్యాపీ బర్త్ డే.నీ ప్రేమ, ఎనర్జీని భర్తీ చేయడం ఎవరి వల్ల కాదు.ఎప్పటికీ ఐ లవ్ యూ’ అని విష్ణుప్రియ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం విష్ణు ప్రియ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ సైతం ఎమోషనల్ అవుతున్నారు.