బుల్లితెర లేడీ యాంకర్లలో కొంతమంది యాంకర్లు పెళ్లి తర్వాత కూడా సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తుంటే మరి కొందరు యాంకర్లు మాత్రం అవకాశాలు తగ్గిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారు.ఈ మధ్య కాలంలో బుల్లితెర యాంకర్ శ్రీముఖి పెళ్లి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.
శ్రీముఖి అభిమానులతో ముచ్చటించే సమయంలో ఆమె పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.

పెళ్లికి సంబంధించిన ప్రశ్నలతో విసిగిపోయిన శ్రీముఖి ఆ ప్రశ్నల గురించి ఘాటుగా స్పందించారు.బుల్లితెరపై, వెండితెరపై ఆఫర్లతో పాటు సోషల్ మీడియాలో సైతం శ్రీముఖి బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.తాజాగా అభిమానులతో శ్రీముఖి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించారు.
జులాయి, నేను శైలజ, జెంటిల్ మేన్ మరికొన్ని సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించిన శ్రీముఖి కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేశారు.
బుల్లితెరపై అదుర్స్ షో ద్వారా యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన శ్రీముఖి వరుసగా షోలు చేస్తూ యాంకర్ గా సత్తా చాటారు.
క్రేజీ అంకుల్స్, మ్యాస్ట్రో సినిమాలలో శ్రీముఖి కీలక పాత్రలు చేశారు.తాజాగా నెటిజన్ శ్రీముఖి పెళ్లి కోసం వెయిటింగ్ అని అడగగా ఎప్పుడు తన పెళ్లి గురించే ఎందుకు అడుగుతున్నారని తనకేం వయస్సు అయిపోయిందా.? అంటూ శ్రీముఖి ప్రశ్నించారు.

ప్రస్తుతం తాను జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నానని తనకు ఇంకా వయస్సు అయిపోలేదని సమయం వస్తే పెళ్లి చేసుకుంటానని శ్రీముఖి తెలిపారు.అప్పటివరకు తాను ఒంటరి జీవితాన్ని ఆస్వాదిస్తానని శ్రీముఖి చెప్పుకొచ్చారు.శ్రీముఖి ఇచ్చిన సమాధానంతో ఆమె పెళ్లి ఇప్పట్లో ఉండదని నెటిజన్లు భావిస్తున్నారు.
శ్రీముఖి పెళ్లికి సంబంధించి చాలా సందర్భాల్లో స్పష్టత ఇస్తున్నా పెళ్లికి సంబంధించిన ప్రశ్నలు మాత్రం ఎదురవుతూనే ఉన్నాయి.