సాధారణంగా చెప్పాలంటే ఉదయం నిద్ర లేవగానే మంచి రుచి మరియు వాసన కలిగిన కాఫీ ( Coffee )సేవిస్తూ ఉంటారు.అయితే కాఫీ త్రాగడాన్ని ఒక అరగంట వాయిదా వేసి కేవలం నిమ్మరసం( lemon juice ) తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
క్యాన్సర్ కణాలను చంపే గుణాలు నిమ్మరసంలో ఎన్నో ఉన్నాయి.కానీ మనవ శరీరంలో ఆల్కలీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటేనే ఉత్తమంగా పని చేస్తుంది.
ఆమ్ల పండు గా ప్రసిద్ధి చెందిన నిమ్మకాయను గొప్ప ఆల్కలీన్ ఏజెంట్గా చెప్పవచ్చు.అలాగే నిమ్మరసం తాగినప్పుడు శరీరంలో ఆమ్ల స్థాయిలు తగ్గిపోతాయి.

ఏదైనా ఆహారం తిన్నప్పుడు ఎసిడిక్ గా ఉన్నప్పుడు మరియు చర్మం యొక్క పీహెచ్ స్థాయిలను తగ్గించడానికి నిమ్మకాయ నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది.విటమిన్లు మరియు ఖనిజాలు ( Minerals )సమృద్ధిగా ఉంటాయి.నిమ్మకాయ లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, విటమిన్ సి గుణాలు సమృద్ధిగా ఉండుట వల్ల రోగనిరోధక వ్యవస్థ త్వరగా మెరుగుపడుతుంది.అలాగే నిమ్మకాయలో ఉండే విటమిన్ బి శక్తి ఉత్పత్తి,రిబోఫ్లేవిన్ కోసం పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

అలాగే కాల్షియం వంటి ఖనిజాలు కణజాలం అభివృద్ధి మరియు మరమ్మత్తు కోసం ఉపయోగపడతాయి.మెగ్నీషియం( Magnesium ) మరియు ఫాస్ఫరస్ ఎముకలు( Phosphorous bones ) మరియు దంతాల ను బలంగా మార్చడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.ఇంకా చెప్పాలంటే ప్రతి రోజు నిమ్మకాయ రసాన్ని వినియోగిస్తే ముడతలు తగ్గి చర్మం మంచి యవ్వనంగా కనిపిస్తుంది.అంతేకాకుండా నిమ్మకాయ శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడం వల్ల చర్మం ఆరోగ్యవంతంగా, అలాగే ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
ముఖ్యంగా చెప్పాలంటే అధిక బరువు దూరం చేసుకోవాలని అనుకునే వారికి నిమ్మకాయ రసం ఎంతగానో ఉపయోగపడుతుంది.ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు చల్లని లేదా వేడి నీరు తీసుకోవాలి.
ఇప్పుడు ఈ గ్లాస్ నీటిలో అరా చక్క నిమ్మరసం పిండి ఎటువంటి పంచదార కలపకుండా త్రాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.