Amritsar US Consulate : పంజాబీ ఎన్ఆర్ఐలకు గుడ్‌న్యూస్.. త్వరలో అమృత్‌సర్‌లో యూఎస్ కాన్సులేట్..?

విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికాకు( America ) వెళ్తున్న భారతీయుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.దీంతో వీసాలు, ఇతర ఇమ్మిగ్రేషన్ అవసరాల నిమిత్తం భారత్‌లోని అమెరికన్ మిషన్‌ల వద్ద రద్దీ పెరుగుతోంది.

 Amritsar Likely To Have Us Consulate Ex Ambassador Taranjit Sandhu-TeluguStop.com

న్యూఢిల్లీలో అమెరికా రాయబార కార్యాలయంతో పాటు ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్‌లలో కాన్సులేట్ కార్యాలయాలు వున్నాయి.త్వరలోనే బెంగళూరు, అహ్మదాబాద్‌లలో యూఎస్ కాన్సులేట్( US Consulate ) కార్యాలయాలు ప్రారంభం కానున్నాయి.

ఇదిలావుండగా.పంజాబ్‌లోని ఆధ్యాత్మిక నగరం అమృత్‌సర్‌లోనూ( Amritsar ) యూఎస్ కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అమెరికాలో భారత మాజీ రాయబారి తరంజిత్ సింగ్ సంధూ( Ex-Ambassador Taranjit Singh Sandhu ) ఈ విషయంపై సంకేతాలిచ్చారు.త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో అమృత్‌సర్ నుంచి బీజేపీ అభ్యర్ధిగా తరంజిత్ బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది.

Telugu Amritsar, Mea Jaishankar, Punjab, Punjab Nri, Sriguru, Taranjitsingh, Con

డాక్టర్ తరంజిత్ సింగ్ సంధు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో( S Jaishankar ) ఇటీవల సమావేశమయ్యారు.అమెరికన్ కాన్సులేట్ ఏర్పాటుకు అమృత్‌సర్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.అమెరికాలో భారత రాయబారిగా వున్న సమయంలో గతేడాది నవంబర్‌లో సీటెల్‌లో భారత కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటయ్యేందుకు సంధూ ఎంతో కృషి చేశారు.ఇక్కడ కాన్సులేట్‌ను ప్రారంభించాలని ఏడేళ్ల క్రితం 2016లో ప్రధాని నరేంద్ర మోడీ .అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా( Barack Obama ) నిర్ణయం తీసుకున్నారు.ఇరుదేశాలలో కొత్త కాన్సులేట్‌లను తెరవడానికి పరస్పర ప్రణాళిక ప్రకారం .భారతదేశంలో రెండు కొత్త కాన్సులేట్‌లను ప్రారంభించనున్నారు.అంతేకాదు .సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత 1992లో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో భారత రాయబార కార్యాలయాన్ని ప్రారంభించిన ఘనత కూడా డాక్టర్ తరంజిత్ సింగ్ సంధూకు దక్కింది.అమృత్‌సర్‌లో అమెరికన్ కాన్సులేట్ ప్రారంభంతో సరిహద్దు ప్రాంత ప్రజలు ఇక్కడ వీసా సేవలతో పాటు , వ్యాపారులు తమ వ్యాపారాలను విస్తరించే అవకాశం వుందని సంధూ అన్నారు.

Telugu Amritsar, Mea Jaishankar, Punjab, Punjab Nri, Sriguru, Taranjitsingh, Con

అలాగే అమృత్‌సర్‌లోని శ్రీ గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయం( Sri Guru Ram Dass Jee International Airport ) నుంచి ఎయిర్ కనెక్టివిటీని పెంచడంతో పాటు కార్గో సేవలను ప్రారంభించడంపైనా జైశంకర్‌తో సంధూ చర్చించారు.మెరుగైన కనెక్టివిటీతో అమృత్‌సర్ వృద్ధి సామర్ధ్యం అనేక రెట్లు పెరుగుతుందని సంధూ పునరుద్ఘాటించారు.అమెరికా, కెనడా, యూరోపియన్ , గల్ఫ్ దేశాలతో ఎయిర్ కనెక్టివిటీని పెంచడానికి ఎన్నో అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు.కార్గో సౌకర్యం ద్వారా వ్యాపారులు, రైతులు విదేశీ మార్కెట్‌కు పండ్లు, కూరగాయాలను పంపిణీ చేసి తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు తోడ్పడుతుందని తరంజిత్ సింగ్ సంధూ చెప్పారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube