తన భర్తనే మళ్ళీ పెళ్లి చేసుకున్న హీరోయిన్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ హీరో మహేష్ బాబు నటించిన అతిథి సినిమా మన అందరికీ గుర్తుండే ఉంటుంది.ఇందులో హీరోయిన్ గా నటించిన అమృతా రావు గురించి మనందరికీ తెలిసిందే.

 Amrita Rao And Rj Anmol Reveals Their Wedding Photos, Amrita Rao, Rj Anmol, Marr-TeluguStop.com

ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అమృతారావు మొదటి సినిమాతోనే అందం అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఆ తర్వాత బాలీవుడ్లో పలు సినిమాలలో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.

కానీ పెళ్లి తర్వాత ఆమె తెరపై మళ్లీ కనిపించలేదు.ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇకపోతే ఇది ఇలా ఉంటే తాజాగా అమృత తన పెళ్లి ఫోటోలను షేర్ చేసింది.అమృత కు ఆర్జే అన్మోల్‌ అనే వ్యక్తి తో రహస్య వివాహం జరిగిన విషయం తెలిసిందే.

ఇదే 2014లో తనకు రహస్య వివాహం జరిగింది అన్న విషయాన్ని ఒక వీడియో ద్వారా పంచుకుంది.అయితే ప్రస్తుతం తన భర్తను తానే మళ్లీ పెళ్లి చేసుకుంటూ అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ బ్యూటీ.

ఇప్పుడు తాజాగా ఆర్జే అన్మోల్‌ను మళ్లీ చేసుకుంటూ తమ పెళ్లి నాటి ఫొటోలను ఒక వీడియో రూపంలో బయట పెట్టింది ఈ బ్యూటీ.ఈ దంపతులు అందుకు సంబంధించిన విషయాన్ని యూట్యూబ్ ఛానల్ కపుల్ ఆఫ్ థింగ్స్ లోని కొత్త ఎపిసోడ్ లో వారి వివాహానికి సంబంధించిన వివరాల గురించి పంచుకున్నారు.

పెళ్లి అయిన 8 ఏళ్ల తర్వాత తమ కుటుంబ సభ్యుల మధ్య ఈ జంట మళ్లీ పెళ్లి చేసుకోబోతోంది.అందుకు సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఆ వీడియో ని చూసిన అభిమానులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు.ఈ వీడియోలో అమృత, అన్మోల్‌ తమ కుటుంబ సభ్యులతో కలిసి సంభాషించడం, మెమొరీ లేన్‌లో నడవడం లాంటి మధురమైన క్షణాలను పంచుకున్నారు ఈ జంట.కాగా ఈ సెలబ్రిటీ జంట తమ కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపకుండా ఉండేందుకే రహస్యంగా 2014లో మే 15న వివాహం చేసుకున్నట్లు తెలిపింది.ఈ బ్యూటీఫుల్‌ సెలబ్రిటీ కపుల్‌కు నవంబర్‌ 1, 2020న బాబు జన్మించాడు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube