అగ్ర రాజ్యం అంటే కేవలం సైనిక బలంగం , ఆర్ధిక బలం, సాంకేతికంగా ముందంజ ఇవి మాత్రమే కొలమానం కాదు.ప్రజలు సుఖంగా ఎలాంటి ఆందోళనలకు గురికాకుండా సంతోషంగా ఉండాలి, కూడా.
ప్రజలు ఇబ్బంది పడేలా ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సరే పరిష్కరించగలిగే సామర్ధ్యం ఉండాలి.అప్పుడే సదరు దేశాన్ని అగ్ర రాజ్యంగా చెప్పుకోవచ్చు.
కానీ తాను పెద్దన్నగా ప్రకటించుకుని, అగ్ర రాజ్య హోదాలో కొనసాగుతున్న అమెరికా నిజంగా తన దేశ ప్రజల రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలు శూన్యమనే చెప్పాలి.
సరిగ్గా వారం రోజుల క్రితం అమెరికాలో గన్ కల్చర్ కారణంగా అమాయకపు పిల్లలు, టీచర్స్ చనిపోయిన విషయం అందరికి విధితమే.
ఈ ఘటన ముందు తరువాత కూడా అమెరికా ప్రజలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి.తుపాకి సంస్కృతి కారణంగా అమెరికాలో యదేశ్చగా తుపాకుల దాడులు జరుగుతున్నాయి.అయినా సరే ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో నిందితులు మరింతగా రెచ్చిపోతున్నారు.పిల్లలపై దాడి ఘటన తరువాత దాడి చేసిన వ్యక్తి తనని తానూ కాల్చుకుని చనిపోయాడు.
ఈ ఘటన మరువక ముందే.
అమెరికాలోని ఒక్లహామాలోని ఆసుపత్రి లో ఓ వ్యక్తి ఇద్దరు నర్సులను కాల్చి చంపేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించగా కాల్పులకు పాల్పడిన వ్యక్తి తనని నేరుగా పోలీసులకు లొంగి పోయాడు.
ఇదే తరహా ఘటన అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో చోటు చేసుకుంది.లాస్ ఏంజిల్స్ లోని సదరన్ కాలిఫోర్నియా ఆసుపత్రిలోకి ప్రవేశించిన ఓ దుండగుడు అక్కడ వైద్యురాలిపై నర్సుపై కాల్పులు జరిపాడు.
అయితే ఈ దాడిలో ఇద్దరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరుగక పోయినా నర్సు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.అయితే ఈ ఘటనలో దుండగుడికి కూడా గాయాలు కావడంతో అతడిని ఆసుపత్రికి తరలించారు.
కాగా అమెరికాలో గన్ కల్చర్ పై నియంత్రణ తీసుకురావాల్సిందేనని ఈ ప్రభుత్వం ఇప్పటికి మేలుకోక పొతే మరిన్ని దాడులు జరిగి ఎంతో మంది అమెరికన్స్ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి గన్ కల్చర్ నియంత్రణ పై సుదీర్ఘ పోరాటం చేస్తున్న ప్రజా సంఘాలు.