బుల్లితెర షోలలో ఒకటైన క్యాష్ షోలో యాంకర్ సుమ చేసే సందడి మామూలుగా ఉండదనే సంగతి తెలిసిందే.తాజాగా క్యాష్ షో ప్రోమో రిలీజ్ కాగా ఆనంద్ తన భార్య మంజులతో కొమరం తన భార్య రజితతో శాంతికుమార్ తన భార్య సుమతో సత్తిపండు తన భార్య నాగమాంభతో కలిసి హాజరయ్యారు.
ప్రోమోలో నాగమాంభ సుమను వదినా అని పిలవగా సత్తిపండు థాంక్యూ అక్కా అంటూ సుమ పరువు తీసేశారు.సుమ నాగమాంభను 100 కోట్లు ఇచ్చి మా ఆయనను కొనేయమంటే కొనేస్తారా అని అడగగా మా ఆయన సత్తిపండు బంగారం అని నేను ఇవ్వనని ఆమె చెబుతారు.
ఆనంద్ వెంటనే బంగారం అంతా మీరు వేసుకుని మా ఆయన బంగారం అని చెబుతారేంటని ప్రశ్నిస్తాడు.రజిత నీకు 200 కోట్లు ఇస్తా మీ ఆయనను అమ్మేస్తావా అంటే ఆమె కూడా అమ్మనని చెబుతుంది.6 సంవత్సరాల క్రితం అయితే అమ్మేదని కొమరం చెప్పగా 6 సంవత్సరాల తర్వాత కూడా అమ్మేస్తుందని ఆనంద్ కామెంట్ చేస్తాడు.
యాంకర్ సుమ శాంతికుమార్ భార్య సుమను అలాంటి ఆలోచనలు వచ్చాయా అని అడగగా వచ్చాయి కాని కొనేవాళ్లు ముందుకు రాలేదని శాంతికుమార్ అన్నారు.
ఆ తర్వాత కొమరం తన భార్యకు వీపు గోకాలని సూచించగా ఆమె భర్త చెప్పిన విధంగా చేస్తుంది.కొమరం కాళ్లు ఒత్తాలని కోరగా భార్య అతను చెప్పిన విధంగా చేస్తుంది.
పెళ్లై 13 సంవత్సరాలైందని సుమక్క పుణ్యమా అని భార్య తన కాళ్లు పట్టుకుందని కొమరం చెప్పుకొచ్చారు.

ఆనంద్ తన భార్యను కూడా కాళ్లు ఒత్తాలని కోరగా ఆమె కోపంగా ఎక్స్ ప్రెషన్ ఇస్తుంది.అయితే ఆ తర్వాత ఆనంద్ భార్య మంజులను కుర్చీలో కూర్చొబెట్టి కాళ్లు పడతాడు.సత్తిపండు తన భార్యను ఎస్కలేటర్ నుంచి దూకాలని కోరగా ముందు మీరు చూపించాలని అతని భార్య చెబుతుంది.
ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.







