అల్లు అర్జున్ ఇటీవల జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.అల వైకుంఠపురంలో చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన నేపథ్యంలో జాతీయ మీడియాలో ఆయన ముచ్చట్లు చర్చనీయాంశం అయ్యాయి.
భారీ ఎత్తున పబ్లిసిటీ చేసుకునే విధంగా అల్లు అర్జున్ జాతీయ మీడియాను పిలిచి మరీ ఇంటర్వ్యూ ఇచ్చాడంటూ ప్రచారం జరుగుతుంది.ఇక ఆ ఇంటర్వ్యూలో ముంబయి ముచ్చట్లు, బాలీవుడ్ ఎంట్రీ అవకాశం గురించి బన్నీ మాట్లాడాడు.
ముంబయిలో ఇల్లు కొన్నారా అంటూ జర్నలిస్ట్ ప్రశ్నించగా.అందుకు సమాధానంగా బన్నీ మాట్లాడుతూ నాకు ముంబయి అంటే చాలా ఇష్టం.నేను రెగ్యులర్‌గా ముంబయికి వస్తూనే ఉంటాను.ముంబయికి వచ్చిన సమయంలో ప్రస్తుతం నేను గీతాఆర్ట్స్ బ్యానర్ గెస్ట్ హౌస్‌లో స్టే చేస్తాను.అక్కడ నుండి నేను ఎక్కడకు అయినా వెళ్తూ ఉంటాను.అయితే ముంబయిలో నేను ఒక సొంత ఇల్లు కొనుగోలు చేయాలని మాత్రం కోరికగా ఉంది.
నాకు ఇష్టమైన ప్రదేశాల్లో ముంబయి ఒకటి కనుక అక్కడ ఇల్లు ఉండాలనేది నా ఆశ.అక్కడకు వెళ్లిన ప్రతి సారి నా సొంత ఇంట్లో స్టే చేస్తానంటూ చెప్పుకొచ్చాడు.అయితే ఎప్పుడు కొనుగోలు చేసేది చెప్పలేదు.ప్రస్తుతం బన్నీ జోరు చాలా స్పీడ్‌గా ఉంది.అందుకే ఆయన తన పారితోషికంతో వచ్చే ఏడాది వరకు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది.మరో వైపు ఈయన బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చే విషయమై ఆసక్తిగా ఉన్నట్లుగా ప్రకటించాడు.
అయితే అది ఎప్పుడు ఏంటీ అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.