రాములో రాముల ఏంటీ ఈ జోరు

అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల వైకుంఠపురంలో చిత్రం సూపర్‌ హిట్‌ అయ్యింది.సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం సంక్రాంతి విజేతగా నిలిచింది.

 Ramulo Ramula Reached 200 Million Views-TeluguStop.com

బన్నీ కెరీర్‌లో మొదటి సారి వంద కోట్ల మార్కును దాటాడు.అంతే కాకుండా ఇండస్ట్రీ హిట్‌ను కూడా దక్కించుకున్నాడు.

సినిమా ఇంతగా సక్సెస్‌ అవ్వడానికి కారణం థమన్‌ అని చెప్పకుండా ఉండలేం.ఆ విషయాన్ని స్వయంగా త్రివిక్రమ్‌ మరియు బన్నీ ఒప్పుకున్నారు.

Telugu Alluarjun, Ramulo Ramula, Ramuloramula, Ssthaman, Trivikramallu-Movie

థమన్‌ స్వరపర్చిన సామజవరగమనా, రాములో రాముల, బుట్ట బొమ్మ పాటలు షేక్‌ చేశాయి అనడంలో ఎలాంటి సందేమం లేదు.యూట్యూబ్‌లో సెన్షేషన్‌ క్రియేట్‌ చేస్తూనే ఉన్న ఈ మూడు పాటలు సరికొత్త రికార్డుల దిశగా దూసుకు పోతున్నాయి.ఇప్పటి వరకు ఏ తెలుగు పాటలు కూడా సాధించని వ్యూస్‌ను దక్కించుకుంటూ దూసుకు పోతున్నాయి.ముఖ్యంగా రాములో రాముల పాట ఊహకు అందని విధంగా వ్యూస్‌ను రాబట్టుకుంటూ వెళ్తోంది.

Telugu Alluarjun, Ramulo Ramula, Ramuloramula, Ssthaman, Trivikramallu-Movie

తాజాగా రాములో రాముల పాట యూట్యూబ్‌లో ఏకంగా 200 మిలియన్‌ల వ్యూస్‌ను పూర్తి చేసుకుంది.ఈ జోరు చూస్తుంటే ఇంకా కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది.250 మిలియన్‌ల వ్యూస్‌ వరకు ఈ పాట దక్కించుకునే అవకాశం ఉందంటున్నారు.ప్రస్తుతానికి మరో మంచి మాస్‌ బీట్‌ ఏదీ లేదు కనుక రాములో రాముల జోరు కంటిన్యూ అవుతూనే ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube