జైలుకెళుతున్న నితిన్.. అంతా ఆయన పుణ్యమేనట!

యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం భీష్మ షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది.వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Nithiin As Prisoner To Go In Jail For Chandrasekhar Yeleti-TeluguStop.com

ఈ సినిమా రిలీజ్ కాకముందే నితిన్ తన నెక్ట్స్ మూవీలను రెడీ చేస్తున్నాడు.ఇప్పటికే రంగ్‌దే అనే సినిమాలో నటిస్తున్న నితిన్, ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్‌లో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఔట్ అండ్ ఔట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.ఈ సినిమాలో నితిన్ ఓ ఖైదీగా కనిపిస్తాడట.ఈ సినిమా మెజారిటీ శాతం జైలు బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కనుందట.భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నారు.

ఇక ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించనున్నారు.

కాగా నితిన్ నటించిన భీష్మ చిత్రం ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది.

ఈ సినిమాను ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.మరి ఈ సినిమాతో నితిన్ ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి అంటున్నారు ప్రేక్షకులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube