రాములో రాముల ఏంటీ ఈ జోరు
TeluguStop.com
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల వైకుంఠపురంలో చిత్రం సూపర్ హిట్ అయ్యింది.
సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం సంక్రాంతి విజేతగా నిలిచింది.బన్నీ కెరీర్‌లో మొదటి సారి వంద కోట్ల మార్కును దాటాడు.
అంతే కాకుండా ఇండస్ట్రీ హిట్‌ను కూడా దక్కించుకున్నాడు.సినిమా ఇంతగా సక్సెస్ అవ్వడానికి కారణం థమన్ అని చెప్పకుండా ఉండలేం.
ఆ విషయాన్ని స్వయంగా త్రివిక్రమ్ మరియు బన్నీ ఒప్పుకున్నారు. """/"/థమన్ స్వరపర్చిన సామజవరగమనా, రాములో రాముల, బుట్ట బొమ్మ పాటలు షేక్ చేశాయి అనడంలో ఎలాంటి సందేమం లేదు.
యూట్యూబ్‌లో సెన్షేషన్ క్రియేట్ చేస్తూనే ఉన్న ఈ మూడు పాటలు సరికొత్త రికార్డుల దిశగా దూసుకు పోతున్నాయి.
ఇప్పటి వరకు ఏ తెలుగు పాటలు కూడా సాధించని వ్యూస్‌ను దక్కించుకుంటూ దూసుకు పోతున్నాయి.
ముఖ్యంగా రాములో రాముల పాట ఊహకు అందని విధంగా వ్యూస్‌ను రాబట్టుకుంటూ వెళ్తోంది.
"""/"/తాజాగా రాములో రాముల పాట యూట్యూబ్‌లో ఏకంగా 200 మిలియన్‌ల వ్యూస్‌ను పూర్తి చేసుకుంది.
ఈ జోరు చూస్తుంటే ఇంకా కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది.250 మిలియన్‌ల వ్యూస్ వరకు ఈ పాట దక్కించుకునే అవకాశం ఉందంటున్నారు.
ప్రస్తుతానికి మరో మంచి మాస్ బీట్ ఏదీ లేదు కనుక రాములో రాముల జోరు కంటిన్యూ అవుతూనే ఉంటుంది.