పుష్ప విలన్ ను చూస్తే షాక్ అవ్వాల్సిందే.. ఫాహద్ ఫాజిల్ లుక్ రిలీజ్!

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “పుష్ప“.గంధపు చెక్కల స్మగ్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో ఒక లారీ డ్రైవర్ గా కనిపించనున్నారు.ఇందులో అల్లుఅర్జున్ సరసన కథానాయికగా రష్మిక నటిస్తున్నారు.ఈ చిత్రంలో అల్లు అర్జున్ తో పోటీ పడటానికి మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

 Allu Arjun , Pushpa, Fahadh Faasil, New Look, Latest Tollywood News-TeluguStop.com

ఈ క్రమంలోనే ఫహద్ ఈ సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ అనే ఐపీఎస్ IPS పాత్రలో కనిపించనున్నారు.

తాజాగా ఈ సినిమాలో నటుడు ఫహద్ లుక్ విడుదల చేసింది.

పూర్తిగా బోడి గుండులో కనిపిస్తున్నటువంటి ఫహద్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకొని అల్లు అర్జున్ కు సరైన పోటీ అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా నిడివి ఎక్కువగా ఉండటం కారణంగా ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా దర్శకుడు తెరకెక్కిస్తున్నారు.

Telugu Allu Arjun, Fahadh Faasil, Pushpa-Movie

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో సుకుమార్ తెరకెక్కిన ఈ చిత్రానికి సంబంధించిన మొదటి భాగాన్ని ముందుగా దసరా కానుకగా అక్టోబర్ 13వ తేదీన విడుదల చేయాలని భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది.ఈ క్రమంలోనే ఈ ఏడాది చివర క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది.మొట్టమొదటి సారిగా అల్లుఅర్జున్ పాన్ ఇండియా స్థాయిలో నటిస్తున్నారు.

మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube