నీట్‌ పరిధిలోకే ప్రైవేట్ వైద్య కళాశాలలు

నీట్ ఆర్డినెన్స్ కు రాష్ట్రప‌తి ఆమోదం తెలిపిన నేప‌ధ్యంలో దేశంలోని అన్ని ప్రైవేట్ వైద్య కళాశాలలు నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్‌) పరిధిలోకి రానున్న‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె పి న‌డ్డా స్ప‌స్టం చేసారు.

 All Private Medical Colleges To Come Under Neet-TeluguStop.com

మంగళవారం ఆయ‌న త‌న‌ని క‌లసిన మీడియా ్ర‌ప‌తినిధుల‌తో మాట్లాడుతూ దేశంలోని వైద్య క‌ళాశాల‌లలో సీట్ల భర్తీ పలు విధాలుగా జరుగుతుండటం వల్ల విద్యార్ధులకు జ‌రుగుతున్న నష్టం గుర్తించిన తమ ప్రభుత్వం అనేక విధాలుగా ఆలోచనలు జరిపాకనే దేశ వ్యాప్తంగా గా ఒకే త‌ర‌హా ప‌రీక్ష‌కు రంగం సిద్ధం చేసామ‌ని అన్నారు ఇప్పటికే జూలై 24 న నీట్ ను నిర్వ‌హించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అలాగే పీజీ కోర్సులకు, డిసెంబర్ లో నీట్ జ‌రుగుతుంద‌ని చెప్పారు.

నీట్‌కు వివిధ రూపాల‌లో క‌లుగుతున్న ఆటంకాల‌ను అధిక‌మించేందుకు వీలుగా ఈ ఆర్డినెన్స్ తీసుకువచ్చిన‌ట్లు చెప్తూ .హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, చండీగఢ్ నీట్ క్రింద పరీక్షలకు జరిపేందుకు అంగీక‌రించాయ‌ని, పశ్చిమబెంగాల్, చత్తీస్ ఘ‌డ్‌, అస్సాం, ఆంధ్ర ప్రదేశ్ లు కొంత మిన‌హాయింపులు కోరాయ‌ని, బీహార్, ఢిల్లీల విష‌య‌మై ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మంత్రి జె పి న‌డ్డా తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube