భారత్ సామర్ధ్యాన్ని ప్రపంచం గుర్తించింది .. మోడీ ఫారిన్ పాలసీపై విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రశంసలు

విదేశాల్లో స్థిరపడిన భారతీయుల దృక్పథంలో మార్పు వచ్చిందన్నారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్.

 All Praise For Modi’s Foreign Policy, Says External Affairs Minister Jaishanka-TeluguStop.com

ఎనిమిదేళ్ల భారత విదేశాంగ విధానం అన్న అంశంపై విశాఖలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.గడిచిన ఎనిమిదేళ్లలో ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో భారత్ అద్భుతమైన సామాజిక మార్పును సంతరించుకుందని జైశంకర్ అన్నారు.

మోడీ విదేశాంగ విధానాన్ని విదేశాల్లోని భారతీయులందరూ ప్రశంసిస్తున్నారని కేంద్ర మంత్రి అన్నారు.కోవిడ్ 19 వంటి విపత్కర పరిస్ధితిని భారతదేశం ఎదుర్కోగలదా అని ప్రపంచం అనుమానపు చూపులు చూసిందని జైశంకర్ గుర్తుచేశారు.

కానీ 138 కోట్ల మంది జనాభాలో అర్హులైన భారతీయులకు వ్యాక్సిన్ వేసినప్పుడు, భారత్ కోవిడ్ మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నప్పుడు తాము ఊహించింది తప్పు అని ప్రపంచ దేశాలు గ్రహించాయని కేంద్రమంత్రి అన్నారు.

Telugu Praisemodis, Modi, Primeministers, Externalaffairs, America, Caribbean-Te

కోవిడ్ 19 నిర్వహణలో భారత్ ప్రపంచ దేశాల మన్ననలు పొందిందని.మనదేశంలో తయారైన టీకాలను కరేబియన్, దక్షిణ అమెరికా దేశాలకు ఎగుమతి చేశామని జైశంకర్ గుర్తుచేశారు.రష్యాతో యుద్ధం కారణంగా దెబ్బతిన్న ఉక్రెయిన్ నుంచి తమ పౌరులను విజయవంతంగా స్వదేశానికి తీసుకొచ్చిన ఏకైక దేశం భారత్‌ మాత్రమేనని ఆయన అన్నారు.

ఈ విషయంలో ఇతర దేశాలు ఇండియాను అనుసరించాయని కేంద్రమంత్రి పేర్కొన్నారు.

Telugu Praisemodis, Modi, Primeministers, Externalaffairs, America, Caribbean-Te

కోవిడ్ సమయంలో మోడీ.ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందజేశారని జైశంకర్ వెల్లడించారు.అన్ని రకాల వాతావరణ పరిస్ధితుల్లోనూ భారత్ తన సరిహద్దులను రక్షించుకోగలదని మోడీ నిరూపించారని విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఇప్పుడు అన్ని దేశాలు వార్షిక కార్యక్రమంగా మార్చాయని .ఎన్నో దేశాలు సూర్యుని కదలిక ఆధారంగా ఆ రోజును పాటిస్తున్నాయని ఆయన వెల్లడించారు.మొత్తం మీద భారతదేశ శక్తి సామర్ధ్యాలను ప్రపంచం గుర్తించిందని డాక్టర్ ఎస్.జైశంకర్ అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube