బాలీవుడ్ కు ఊపిరి అందిస్తారా.. 'బ్రహ్మాస్త్ర'తో అన్నింటికీ చెక్ పెడతారా..

బాలీవుడ్ కు గత కొన్ని రోజులుగా అస్సలు కలిసి రావడం లేదు.ఒకవైపు మన సౌత్ ఇండస్ట్రీ అక్కడ వందల కోట్లు వసూళ్లు చేస్తుంటే.

 Alia Bhatt Ranbir Kapoor Brahmastra Clears All Fears Of Bollywood Details, Rajam-TeluguStop.com

బాలీవుడ్ మాత్రం ఇప్పటికి ఈ ఏడాది ఇంకా బోణీ కొట్టలేదు.వరుసగా పెద్ద సినిమాలు సైతం ప్లాప్ ఎదుర్కొంటూ బాలీవుడ్ ను మరింత కష్టాల్లోకి నెట్టేస్తుంది.

ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా తో, అక్షయ్ కుమార్ రక్షా బంధన్ సినిమాలతో వచ్చారు.ఈ పెద్ద సినిమాలు అయినా హిట్ అయ్యి బాలీవుడ్ ను గట్టెక్కిస్తాయి అని అంతా అనుకున్నారు కానీ రిజల్ట్ వేరేలా రావడంతో మళ్ళీ మొదటికే వచ్చింది.

ఇక ఇప్పుడు మరో పెద్ద సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది.బ్రహ్మాస్త్ర సినిమాతో టీమ్ అంతా బాలీవుడ్ మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అవుతున్నారు.

అయితే ఈ సినిమాపై అన్ని చోట్ల కాస్త పాజిటివ్ వస్తుండడంతో ఈ సినిమా బాలీవుడ్ ఆశలను నెరవేరుస్తుందేమో అనే ఆశ అందరిలో మొదలయ్యింది.ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వడంతో 50 నుండి 60 శాతం టికెట్స్ కూడా సేల్ అయ్యాయట.

మరి అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు ఈ సినిమా బాలీవుడ్ కు కొత్త ఊపిరి పోస్తుందా.

Telugu Alia Bhatt, Bollywood, Brahmastra, Rajamouli, Ranbir Alia, Ranbir Kapoor-

ఇప్పటి వరకు బాలీవుడ్ ఎదుర్కొన్న భయాలను ఈ సినిమాతో అయినా పోతాయా అనేది చూడాలి.

ఇక ఈ సినిమా సెప్టెంబర్ 9న పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.రణబీర్ కపూర్ హీరోగా అలియా భట్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కింది.

ఈ సినిమాలో అలియా భట్ మొదటిసారి తన భర్త రణబీర్ కపూర్ తో కలిసి నటిస్తుంది.అలాగే సౌత్ లోని నాలుగు భాషల్లో రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తుండడంతో తెలుగులో కూడా ఈ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకు వెళ్లేందుకు రాజమౌళి ప్రొమోషన్స్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నాగార్జున కూడా కీలక పాత్రలలో నటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube