ఒకప్పుడు అంటే ఇప్పుడు కూడా అనుకోండి.భర్త తాగి ఇంటికి వస్తే భార్యకు కోపం వచ్చేది.
భార్య చివాట్లు పెట్టేది.ఇక భర్త మరి క్రూరుడు అయితే పెళ్ళాంతో గొడవలు పడి చితకొట్టేవాడు.
ఇక అది చూసి పాపం ఆమె.భర్త తాగుబోతు ఎప్పుడు గొడవలే అంటూ పక్కింటి వారు మాట్లాడేవారు.కానీ ఇప్పుడు డిఫరెంట్.పాపం అనాల్సింది భార్యను కాదు భర్తను.
ఎందుకు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.ఓ భార్య భర్తను దారుణంగా చిత్రహింసలకు గురిచేస్తుంది.
ఫుల్ గా తాగి భర్తను కొట్టిన చోటు కొట్టకుండా చితగొడుతుంది.ఆ భర్త ఏమో నన్ను కొట్టొదే బాబు అంటూ ఏడుపు ముఖం పెట్టేశాడు.
ఈ ఘటన కాస్త షాకింగ్ గా అనిపించినప్పటికి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.
ఓ భర్త భార్య వేధింపులు తట్టుకోలేక పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు.తనకు, తన తల్లితండ్రులకు భార్య నుంచి రక్షణ కావాలని వాపోయాడు.గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మణినగర్ ఏరియాకి చెందిన 29 ఏళ్ళ వ్యక్తి ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.2018 మార్చి నెలలో పెళ్లి కూడా చేసుకున్నాడు.
అయితే పెళ్లికి ముందు వరకు బాగానే ఉన్న ఆ యువతీ వివాహం తర్వాత భర్తకు చుక్కలు చూపించడం స్టార్ చేసింది.తాగి ఎంతో టార్చర్ చేసింది.అయితే భర్తతో ఏకాంతంగా ఉండాలని అత్తమామలను బయటకు పంపాలని భర్తను ఒత్తిడి చేస్తూ వచ్చింది.దీంతో అతను ఎంతకీ ఒప్పుకోకపోవడంతో భర్తను, అతని తల్లితండ్రులను కింద ఫ్లోర్ కి షిఫ్ట్ చేసింది.
అక్కడితో ఆ మహిళ ఆగలేదు.
ఆమె పేరుపైనే ఇల్లు రాసివ్వాలని గొడవకు దిగింది.
ఒకవైపు తల్లితండ్రులకు కరోనా సోకి అష్టకష్టాలు పడుతుంటే భార్య పట్టించుకోవడంలేదని అతను మానసికంగా కుంగిపోగా ఇటు భార్య తాగి వచ్చి అందరిని తిడుతూ కొడుతూ వచ్చింది.దీంతో భర్త పోలీస్ స్టేషన్ కి వెళ్లి పిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.