అక్ష‌య్ కుమార్ తదుప‌రి చిత్రం పృథ్వీరాజ్ నుంచి విడుద‌లైన మొద‌టి పాట హ‌రిహ‌ర్

సూపర్ స్టార్ అక్షయ్ కుమార్, 2017 మిస్ యూనివర్స్ మనుషి చిల్లర్ అరంగేట్రం చేస్తున్న చారిత్రాత్మక చిత్రమే ఈ “పృథ్వీరాజ్“.ఈ సినిమాని యాష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్నారు.

 Akshay Kumar Is Saluting The Spirit Of Samrat Prithviraj Chauhan In The First So-TeluguStop.com

ఇది అత్యంత పరాక్రమ ధైర్య సాహసాలు కలిగి ఢిల్లీ ని పరిపాలించిన పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క జీవిత చరిత్రను ఆధారంగా తీసుకుని తెరకెక్కించబడింది.ఢిల్లీ సామ్రాజ్యంపై అత్యంత క్రూరమైన దండయాత్ర చేసిన మహమ్మద్ ఘోరీ నుండి భారతదేశాన్ని రక్షించడానికి ధైర్యంగా పోరాడిన పురాణ యోధుని పాత్రలో అక్షయ్ నటిస్తున్నాడు.

ఈ సినిమాలోని మొదటి పాట “హరి హర్” ను అక్షయ్ కుమార్ రిలీజ్ చేస్తూ, తన నటన జీవితంలో విన్న అత్యంత దేశభక్తి నిండి ఉన్న పాటగా చెప్పుకొచ్చారు.అక్షయ్ మాట్లాడుతూ “హరి హర్ పాట ఈ సినిమాకి ఒక ఆత్మ లాంటిది.

మహ్మద్ ఘోరీ తో చేసిన యుద్ధంలో సర్వస్వాన్ని త్యాగం చేసిన పృథ్విరాజ్ చౌహాన్ కి నా వందనం.దేశాన్ని రక్షించాలనే పృథ్విరాజ్ యొక్క బలమైన పట్టుదల ఈ పాటలో ప్రతిబింబిస్తుంది.

అందుకే ఈ పాట నా మనుసుకి లోతుగా హత్తుకుంది” ఇంకా మాట్లాడుతూ “ఈ పాట పృథ్వీరాజ్ తత్వాన్ని , దృఢ సంకల్పాన్ని తెలియజేస్తుంది .మొదట సారి విన్నపుడే ఈ పాటతో ప్రేమలో పడ్డాను”

అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ సీరియల్ “చాణిక్య” ని తెరకెక్కించిన డా.చంద్రప్రకాష్ ద్వివేది “పృథ్వీరాజ్‌” సినిమాకి దర్శకత్వం వహించారు.పృథ్వీరాజ్ భార్య సంయోగిత పాత్రలో మనుషి చిల్లర్ కనిపించనుంది.

ఈ చిత్రం జూన్ 3వ తారీఖున హిందీ, తమిళంతో పాటు తెలుగులో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube