అఖండ మూవీ సీక్వెల్ లో చైనీస్ విలన్.. పాన్ వరల్డ్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారా?

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు చాలా మంచి క్రేజ్ ఉంటుంది.అలాంటి కాంబినేషన్లలో నందమూరి బాలకృష్ణ,( Nandamuri Balakrishna ) బోయపాటి( Boyapati ) కాంబినేషన్ కూడా ఒకటని చెప్పాలి.

 Akhanda Movie Sequel Villain Details, Nandamuri Balakrishna, Director Boyapati S-TeluguStop.com

ఇప్పటివరకు వీరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి.వీరిద్దరి కాంబినేషన్లో ముందుగా సింహా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో అనంతరం లెజెండ్, అఖండ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నాయి.

Telugu Akhanda, Akhanda Villain, Akhanda Sequel, Chinese Villain, Boyapati Srinu

ఇలా వీరి కాంబినేషన్లో చివరిగా అఖండ సినిమా( Akhanda ) విడుదల అయింది.త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా అఖండ 2( Akhanda 2 ) ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాని అధికారకంగా కూడా ప్రకటించారు.

ఇక ఈ సినిమాకు నందమూరి తేజస్విని సహా నిర్మాతగా వ్యవహరించబోతున్న సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బాలకృష్ణ సినిమా అంటే భారీ స్థాయిలో యాక్షన్ సన్ని వేషాలు ఉంటాయి అలాగే విలన్లకు కూడా మంచి ప్రాధాన్యత ఉంటుంది.

Telugu Akhanda, Akhanda Villain, Akhanda Sequel, Chinese Villain, Boyapati Srinu

ఇక ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కోసం ఈయన పెద్ద ఎత్తున వేట మొదలు పెట్టారని సమాచారం.అయితే ఇప్పటికే సినిమాలలో నటించిన వారు కాకుండా కొత్తవారిని ఈ సినిమా ద్వారా పరిచయం చేయాలనే ఆలోచనలో బోయపాటి ఉన్నట్టు తెలుస్తోంది.దీని కోసం ఓ ఆడిషన్‌ కాల్‌ కూడా ఇచ్చారు.

ఇలా విలన్ పాత్ర కోసం ఈయన చైనీస్‌( Chinese ) లేదా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఆర్టిస్ట్‌ కోసం చూస్తున్నామని ఆ ఆడిషన్‌ కాల్‌లో తెలియజేశారు.వయసు 50 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలని కోరుతున్నారు.

ఈ ఆడిషన్‌పై ఇండియా ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు.అలాగే ఇందులో 16 నుంచి 18 సంవత్సరాల వయసు గల ఇండియన్ అమ్మాయిలు కూడా కావాలని తెలిపారు.

ఆ అమ్మాయి చేసే పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉన్నట్లు వెల్లడించారు.ఈ విధంగా బోయపాటి విలన్ పాత్ర కోసం ఇంత ప్రాధాన్యత ఇవ్వడం చూస్తుంటే ఈ సినిమాని పాన్ వరల్డ్ స్థాయిలో దింపడానికి ప్లాన్ చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube