అంచనాలు తగ్గడమే దేవరకు వరం కానుందా.. ఓవర్ హైప్ మంచిది కాదంటూ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) త్వరలోనే దేవర సినిమా( Devara ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాపై ఇప్పటివరకు భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

 Over Hype Is Not Good For Devara Movie Details, Ntr, Devara Movie, Devara Movie-TeluguStop.com

ఇదివరకే విడుదల చేసిన పాటలు, టీజర్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచాయి కానీ ఇటీవల సినిమా ప్రమోషన్లలో భాగంగా ట్రైలర్ విడుదల చేయడంతో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు తగ్గిపోయాయి.దేవర ట్రైలర్ ఆచార్య సినిమాలో కొన్ని సన్నివేశాలను తలపిస్తున్న తరుణంలో అభిమానులలో కూడా ఈ సినిమా పట్ల కాస్త ఆందోళన నెలకొంది.

Telugu Acharya, Devara, Devara Hype, Devara Trailer, Jr Ntr, Koratala Siva, Ntr

ఈ సినిమాకు కొరటాల శివ( Koratala Siva ) దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.ఆయన చివరి సినిమా ఆచార్య( Acharya ) డిజాస్టర్ గా నిలిచింది.కానీ ఆ సినిమా ప్రభావం ఎన్టీఆర్ సినిమాపై పడకుండా చాలా జాగ్రత్త పడ్డారు.కొన్ని కారణాలవల్ల ఈ సినిమాకు ఊహించని దానికన్నా భారీ హైప్ పెరిగిపోయింది.ఇక స్టార్ హీరో సినిమా వస్తుంది అంటే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి కానీ దేవర సినిమా ట్రైలర్( Devara Trailer ) మాత్రం ఒక్కసారిగా అంచనాలను తలకిందులు చేస్తోంది.అయితే ఇలా ఈ సినిమా పట్ల అంచనాలు తగ్గడం ఒక విధంగా మంచిదేనని పలువురు భావిస్తున్నారు.

Telugu Acharya, Devara, Devara Hype, Devara Trailer, Jr Ntr, Koratala Siva, Ntr

సినిమాపై ఎన్నో అంచనాలను పెట్టుకొని అదే అంచనాలతో థియేటర్ కి వెళ్లి తిరిగి నిరాశతో వెనక్కి రావడం కంటే ఒక సాధారణ సినిమాని చూడటానికి వెళ్లి మంచి అనుభూతితో థియేటర్ల నుంచి బయటకు రావడం మంచిదని అందుకే ఈ సినిమాకు అంచనాలు తగ్గడమే ఒక విధంగా మంచిదని పలువురు భావిస్తున్నారు.ట్రైలర్ కొంతమేర అభిమానులను నిరాశపరిచిన ఎన్టీఆర్ మాత్రం చివరి 45 నిమిషాలు ప్రేక్షకులకు పూనకాలు వస్తాయని ఎవరూ కూడా సీట్లలో కూర్చోరనే విధంగా కామెంట్లు చేశారు.మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని కలిగిస్తుందనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube