సినిమా ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్లకు చాలా మంచి క్రేజ్ ఉంటుంది.అలాంటి కాంబినేషన్లలో నందమూరి బాలకృష్ణ,( Nandamuri Balakrishna ) బోయపాటి( Boyapati ) కాంబినేషన్ కూడా ఒకటని చెప్పాలి.
ఇప్పటివరకు వీరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి.వీరిద్దరి కాంబినేషన్లో ముందుగా సింహా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో అనంతరం లెజెండ్, అఖండ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నాయి.
ఇలా వీరి కాంబినేషన్లో చివరిగా అఖండ సినిమా( Akhanda ) విడుదల అయింది.త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా అఖండ 2( Akhanda 2 ) ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాని అధికారకంగా కూడా ప్రకటించారు.
ఇక ఈ సినిమాకు నందమూరి తేజస్విని సహా నిర్మాతగా వ్యవహరించబోతున్న సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బాలకృష్ణ సినిమా అంటే భారీ స్థాయిలో యాక్షన్ సన్ని వేషాలు ఉంటాయి అలాగే విలన్లకు కూడా మంచి ప్రాధాన్యత ఉంటుంది.
ఇక ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ కోసం ఈయన పెద్ద ఎత్తున వేట మొదలు పెట్టారని సమాచారం.అయితే ఇప్పటికే సినిమాలలో నటించిన వారు కాకుండా కొత్తవారిని ఈ సినిమా ద్వారా పరిచయం చేయాలనే ఆలోచనలో బోయపాటి ఉన్నట్టు తెలుస్తోంది.దీని కోసం ఓ ఆడిషన్ కాల్ కూడా ఇచ్చారు.
ఇలా విలన్ పాత్ర కోసం ఈయన చైనీస్( Chinese ) లేదా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఆర్టిస్ట్ కోసం చూస్తున్నామని ఆ ఆడిషన్ కాల్లో తెలియజేశారు.వయసు 50 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలని కోరుతున్నారు.
ఈ ఆడిషన్పై ఇండియా ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు.అలాగే ఇందులో 16 నుంచి 18 సంవత్సరాల వయసు గల ఇండియన్ అమ్మాయిలు కూడా కావాలని తెలిపారు.
ఆ అమ్మాయి చేసే పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉన్నట్లు వెల్లడించారు.ఈ విధంగా బోయపాటి విలన్ పాత్ర కోసం ఇంత ప్రాధాన్యత ఇవ్వడం చూస్తుంటే ఈ సినిమాని పాన్ వరల్డ్ స్థాయిలో దింపడానికి ప్లాన్ చేస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది.