అంచనాలు తగ్గడమే దేవరకు వరం కానుందా.. ఓవర్ హైప్ మంచిది కాదంటూ?
TeluguStop.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) త్వరలోనే దేవర సినిమా( Devara ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.
ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాపై ఇప్పటివరకు భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.
ఇదివరకే విడుదల చేసిన పాటలు, టీజర్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచాయి కానీ ఇటీవల సినిమా ప్రమోషన్లలో భాగంగా ట్రైలర్ విడుదల చేయడంతో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు తగ్గిపోయాయి.
దేవర ట్రైలర్ ఆచార్య సినిమాలో కొన్ని సన్నివేశాలను తలపిస్తున్న తరుణంలో అభిమానులలో కూడా ఈ సినిమా పట్ల కాస్త ఆందోళన నెలకొంది.
"""/" /
ఈ సినిమాకు కొరటాల శివ( Koratala Siva ) దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
ఆయన చివరి సినిమా ఆచార్య( Acharya ) డిజాస్టర్ గా నిలిచింది.కానీ ఆ సినిమా ప్రభావం ఎన్టీఆర్ సినిమాపై పడకుండా చాలా జాగ్రత్త పడ్డారు.
కొన్ని కారణాలవల్ల ఈ సినిమాకు ఊహించని దానికన్నా భారీ హైప్ పెరిగిపోయింది.ఇక స్టార్ హీరో సినిమా వస్తుంది అంటే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి కానీ దేవర సినిమా ట్రైలర్( Devara Trailer ) మాత్రం ఒక్కసారిగా అంచనాలను తలకిందులు చేస్తోంది.
అయితే ఇలా ఈ సినిమా పట్ల అంచనాలు తగ్గడం ఒక విధంగా మంచిదేనని పలువురు భావిస్తున్నారు.
"""/" /
సినిమాపై ఎన్నో అంచనాలను పెట్టుకొని అదే అంచనాలతో థియేటర్ కి వెళ్లి తిరిగి నిరాశతో వెనక్కి రావడం కంటే ఒక సాధారణ సినిమాని చూడటానికి వెళ్లి మంచి అనుభూతితో థియేటర్ల నుంచి బయటకు రావడం మంచిదని అందుకే ఈ సినిమాకు అంచనాలు తగ్గడమే ఒక విధంగా మంచిదని పలువురు భావిస్తున్నారు.
ట్రైలర్ కొంతమేర అభిమానులను నిరాశపరిచిన ఎన్టీఆర్ మాత్రం చివరి 45 నిమిషాలు ప్రేక్షకులకు పూనకాలు వస్తాయని ఎవరూ కూడా సీట్లలో కూర్చోరనే విధంగా కామెంట్లు చేశారు.
మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని కలిగిస్తుందనేది తెలియాల్సి ఉంది.
చెట్ల కొమ్మల్లో ఇరుక్కున్న ఆవు.. ఎలా కాపాడాడో చూస్తే..