సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన రాజకీయాలకు సంబంధించిన లేదా ఇతర రంగాలలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వారి బయోపిక్ చిత్రాలను చేయడం గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తుంది.అయితే ఈ మధ్యకాలంలో బయోపిక్ చిత్రాల ట్రెండ్ కాస్త ఎక్కువైంది అని చెప్పాలి.
ఈ క్రమంలోనే క్రికెట్ రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.టీం ఇండియా కెప్టెన్‌గా, బీసీసీఐ అధ్యక్షుడిగా ఆయన సేవలందించిన విషయం తెలిసిందే.
దీంతో ఆయన బయోపిక్‌ను రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.అయితే ఈ సినిమాలో గంగూలీ పాత్రలో ఏ హీరో నటించబోతున్నారు అనే సందేహం అందరిలోనూ నెలకొంది అయితే తాజా సమాచారం ప్రకారం గంగూలి బయోపిక్ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా (Ayushmann Khurrana) నటిస్తున్నట్లు సమాచారం.బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఆయుష్మాన్ ప్రస్తుతం దాదా బయోపిక్ చిత్రంలో నటించబోతున్నారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాల గురించి నిర్మాతలు ఈయనతో చర్చలు జరిపారని తెలుస్తుంది.ఇక తనతో సినిమా చేస్తే నిర్మాతలకు మినిమం లాభాలు గ్యారెంటీ అన్న పేరు కూడా ఉండడంతో ఈ బయోపిక్ చిత్రానికి ఈయనని ఎంపిక చేసినట్టు సమాచారం.ఇకపోతే గంగూలి బయోపిక్ చిత్రానికి సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్(Aishwarya Rajinikanth) దర్శకత్వం వహించబోతున్నారని తెలుస్తుంది.ఇప్పటికే ఈమె పలు సినిమాలకు దర్శకత్వం వహించి సంచలనాలను సృష్టించిన సంగతి తెలిసిందే.
ఇక తన భర్త ధనుష్ కు విడాకులు ఇచ్చిన తర్వాత ఐశ్వర్య పూర్తిగా సినిమాలపై తన ఫోకస్ పెట్టారు.ఈ క్రమంలోనే దాదా బయోపిక్ సినిమా చేసే అవకాశం అందుకున్నారని తెలుస్తోంది.
త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతున్నట్టు సమాచారం.