అఖండ సినిమాను చూసిన అఘోరాలు.. బాలయ్య ఇజం అంటే ఇదే!

బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం అఖండ.ఈ సినిమా తాజాగా విడుదలైన విషయం తెలిసిందే.

 Agoras Watch Nandamuri Balakrishna Akhanda Movie, Akhanda , Balakrishna, Agoras,-TeluguStop.com

ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభిస్తోంది.విడుదల అయిన రెండు రోజుల్లోనే 40 కోట్ల గ్రాస్ చేసి దాదాపుగా 20 కోట్ల షేర్ ను కొల్లగొట్టారు అంటే సినిమా ఎలా హిట్ అయిందో అర్థం చేసుకోవచ్చు.

బోయపాటి బాలకృష్ణ కాంబోలో ఇదివరకే వచ్చిన సింహ,లెజెండ్ లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.ఇక మూడవ సినిమా కూడా అదే రీతిలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

అఖండ సినిమాను చూడడానికి ప్రేక్షకులు థియేటర్ల వద్దకు భారీగా వస్తున్నారు.థియేటర్ల వద్ద హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది.అఖండ సినిమాతో థియేటర్ ల వద్ద మళ్లీ పాత రోజులు కనిపిస్తున్నాయి.థియేటర్లు ప్రేక్షకులతో కిక్కిరిసి పోతున్నాయి.రెండు తెలుగు రాష్ట్రాలలో అఖండ సినిమా పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చింది.కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలోని థియేటర్లలో కూడా జై బాలయ్య నినాదంతో మార్మోగిపోతున్నాయి.

Telugu Agoras, Agoraswatch, Akhanda, Balakrishna, Tollywood-Movie

ఇది ఇలా ఉంటే అఖండ సినిమాలో బాలయ్య అఘోర పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.సినిమాలో ఈ అఘోరా పాత్ర ఎంతో అద్భుతంగా వచ్చింది.అయితే సినిమాలో అఘోరాను చూడడానికి రియల్ అఘోరాలు అఖండ సినిమాకు వెళ్లారట.

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని బంగార్రాజు థియేటర్ లో అఖండ సినిమా ప్రదర్శితమవుతోంది.ఈ సినిమాను చూడటానికి అఘోరాలు ఫస్ట్ షోకి థియేటర్ కు వచ్చారు.

అఘోరాలను చూసిన బాలయ్య అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు.బాలయ్యకు ఈ సినిమాతో అఘోరాలు కూడా ఫ్యాన్స్ అయ్యారు అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube