వరదలు అయిపోయాక చంద్రబాబు అక్కడికి వెళ్లి బురద రాజకీయాలు చేస్తున్నారని మంత్రి రోజా అన్నారు.ఇవాళ వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని రోజా దర్శించుకున్న రోజా చంద్రబాబు పై ఫైర్ అయ్యారు.
చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పులపాల చేసి ఎంజాయ్ చేశారని, కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వ సొమ్మ ప్రజలకోసం వెచ్చిస్తున్నారని రోజా అన్నారు.గోదావరి వరదల్లో నష్టపోయిన బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకున్నామని అన్నారు.14 సంవత్సరాలు అధికారంలో ఉండి పోలవరం పూర్తి చేయలేకపోయిన చంద్రబాబు జగన్ పై అవాకులు చవాకులు పెలుతున్నరని, చంద్రబాబుకి మళ్ళీ అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అమ్మెస్తారని రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు.