తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఇప్పటికే ఇక్కడ టాప్ హీరోయిన్లు గా వెలుగొంది ఇక్కడ హీరోయిన్ గా కెరియర్ ముగిసిన వెంటనే పెళ్లిళ్లు చేసుకుని ఫ్యామిలీతో సెటిల్ అయిపోయిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు.ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగుందుతున్న వాళ్లు కూడా ఉన్నారు.
ప్రస్తుతం యంగ్ హీరోయిన్ గా అలాగే ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరితో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందుతున్న శ్రీలీల( Heroine Sreeleela ) కెరియర్ పరంగా కొంత జాగ్రత్తగా ఉంటే బెటర్ అని చాలామంది సినీ మేధావులు సైతం హెచ్చరిస్తున్నారు.ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో హిట్లు రావడం సహజం…
అలాగని ఆ హిట్టు వచ్చిన తర్వాత మనకి చాలా ఆఫర్లు వస్తూ ఉంటాయి.అలాంటి టైం లో ఏ సినిమా పడితే ఆ సినిమా చేసి ఫ్లాపులు మూటగట్టుకుంటే కెరీర్ కి చాలా ప్రమాదం వస్తుందని ఇంతకుముందు సినిమాల్లో చేసిన సీనియర్ హీరోయిన్ లను చూస్తే మనకు అర్థమవుతుంది.అందుకే శ్రీలీల ఏజ్ కూడా చాలా తక్కువే కాబట్టి ఆమె మంచి సినిమాలు చేసుకుంటూ వెళ్తే దాదాపు ఆమె 10 నుంచి 15 సంవత్సరాల వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్ గా మంచి అవకాశాలు అందుకుంటుందంటు చాలామంది ఆమెకు సలహాలను కూడా ఇస్తున్నారు.
అయితే ఇప్పటికే ఆమె బోయపాటి శ్రీను, రామ్ కాంపిటీషన్ లో చేసిన స్కంద సినిమా( Skanda ) మిక్స్డ్ టాక్ తో రన్ అవుతుంది కాబట్టి తొందరపడి సినిమాలు చేసేకంటే కొన్ని మంచి సినిమాలు చేసి సక్సెస్ లను మూట కట్టుకుంటే మంచిది అని అనే సన్నిహితులు కూడా చెబుతున్నట్టుగా తెలుస్తుంది.ఇప్పటికే మహేష్ బాబుతో గుంటూరు కారం( Guntur Karam ) అనే సినిమాలో నటిస్తుంది…ఈ సినిమా కనక హిట్ అయితే ఆల్మోస్ట్ స్టార్ హీరోలు అందరితో నటించుకుంటూ వెళ్తుంది అనే చెప్పాలి… ఇప్పుడు స్టోరీల సెలక్షన్ లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది…
.