సినీ నటి ప్రముఖ భరతనాట్య కళాకారిణి శోభన ( Shobana ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నటిగా పలు సినిమాలలో నటించిన ఈమె ప్రస్తుతం డాన్స్ స్కూల్ నిర్వహిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
అయితే తాజాగా నటి శోభన ఇంట్లో దొంగతనం జరిగినట్లు ఈమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది.శోభన తన తల్లితో కలిసి చెన్నైలోని తేనాం పేట శ్రీమాన్ శ్రీనివాస కాలనీలో తన తల్లితో కలిసి రెండు అంతస్తుల భవనంలో ఉంది.
మొదటి భవనంలో ఈమె డాన్స్ స్కూల్ నిర్వహించగా రెండో అంతస్తులు వీరు నివాసం ఉంటున్నారు.

ఈమె డాన్స్ క్లాస్ నిర్వహిస్తూ బిజీగా ఉండగా తన తల్లి వయసు పై పడటంతో ఆమెను చూసుకోవడం కోసం విజయ ( Vijaya ).అనే మహిళను శోభన పనిలోకి తీసుకున్నారు.అయితే గత కొద్దిరోజులగా తన తల్లి డబ్బులు కనిపించకుండా పోవడంతో శోభన ఆలోచనలో పడ్డారు.
అయితే తన ఇంట్లోకి పనిమనిషి విజయ తప్ప మరెవరు రావడానికి ఆస్కారమే లేదు దీంతో పనిమనిషి పై సందేహ పడినటువంటి ఈమె స్థానిక పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలోనే పోలీసులు తన పనిమనిషి విజయను అదుపులోకి తీసుకొని విచారించడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

ఈ సందర్భంగా విజయ మాట్లాడుతూ గత మార్చి నెల నుంచి తాను ఇప్పటివరకు 41 వేల రూపాయలు దొంగతనం చేశానని తెలిపారు.అయితే ఈ డబ్బును కారు డ్రైవర్ మురుగన్ ( Car Driver Muragan ) ద్వారా తన కూతురికి గూగుల్ పే చేయించడానికి తెలియజేశారు.అయితే తాను దొంగతనం చేయడానికి మరే కారణం లేదు తనకున్నటువంటి ఇబ్బందుల కారణంగానే తాను ఇలా దొంగతనం చేయాల్సి వచ్చిందని ఈమె తెలియజేసారు.అయితే తాను చేసినది తప్పేనని అందుకు తనని పనిలో నుంచి తొలగించవద్దంటూ ఈమె పోలీసుల ద్వారా శోభనను వేడుకున్నారు.
ఇక శోభన సైతం తనపై కేసు ఫిర్యాదు చేయొద్దని పోలీసులకు చెప్పడమే కాకుండా తాను దొంగలించిన ఆ డబ్బులను తన జీతంలో కట్ చేస్తానని ఇకపై ఏదైనా డబ్బు అవసరమైతే తనని అడగాలి కానీ ఇలా దొంగతనం చేయకూడదు అంటూ తనకు మరో ఛాన్స్ ఇవ్వడం జరిగింది.ఇలా ఈమె తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.