తిమ్మస్ కుంట కు పడిన గండిన పరిశీలించిన మాజీ ఎంపీటీసీ,ఇరిగేషన్ అధికారి

శాశ్వత బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రయత్నాలు ప్రారంభం రాజన్న సిరిసిల్ల జిల్లా :గత వారం రోజులుగా ఎడ తెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎల్లారెడ్డి పేట లోని డబల్ బెడ్ రూం వెనుకాల గల తిమ్మస్ కుంట కు పడిన గండినీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి( Nevuri Venkat Reddy ) ఆదేశాల మేరకు గండిని స్థానిక మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ ఇరిగేషన్ అధికారి భావు సింగ్ తో కలిసి పరిశీలించారు.వర్షం దాటికి కుంట తెగిపోవడం వల్ల మొదటి ,రెండవ బై పాస్ రోడ్డు నీట మునిగి రాకపోకలకు ఇబ్బంది ఏర్పడడం కాకుండా దీని కింద గల 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆయకట్టులో వేసిన నాటు సుమారు 100 ఎకరాల భూమి వర్షానికి వర్శార్పితం అయింది.

 Former Mptc, Irrigation Officer Who Examined The Dam Where Thymus Was Lame , For-TeluguStop.com

ఇట్టి రోడ్డు తెగిపోవడం తో ఈ రోడ్డు మార్గం గుండా ఉన్న రైతులు కిష్టంపల్లి మీదుగా , ఎల్లారెడ్డి పేట గ్రామంలో నుండి చుట్టూ తిరిగి వ్యవసాయ పొలాల వద్దకు రావాల్సి వస్తుందని, అంతే కాకుండా డబల్ బెడ్ రూం లకు ఇదే మార్గం గుండా కుంట తెగిపోక ముందు వెళ్లేవారనీ ఇది తెగిపోవడం వల్ల డబల్ బెడ్ రూం లలో నివాసం ఉంటున్న వారు సైతం గ్రామంలోకి రావడానికి ఇబ్బందులు పడుతున్నారని రైతులు,డబల్ బెడ్ రూం లో నివాసముంటున్న వారు మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ దృష్టికి తీసుకెళ్ళారు.తాత్కాలికంగా రైతులకు, డబల్ బెడ్ రూం లలో నివాసముంటున్న వారికి రాకపోకలకు అంతరాయం కలుగకుండా ఉండేందుకు సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి సహకారంతో పైపులు వేసి తాత్కలికంగా రోడ్డు నిర్మాణం చేసి రాకపోకలు పునరుద్దరింపజేస్తామని బాలరాజు యాదవ్ అన్నారు.

భవిష్యత్ లో దీనిని బిటి రోడ్డు నిర్మాణం చేయడం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి ఇక్కడే పంచాయతీ రాజ్ నిధులతో వంతెన నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ వెంట ఇరిగేషన్ అధికారి బావుసింగ్, రైతులు సందుపట్ల రాజిరెడ్డి,రాగుల రాజిరెడ్డి, పయ్యావుల రాజు యాదవ్, జీడి శ్రీనివాస్, సందుపట్ల మహేందర్ రెడ్డి, మొగుళ్ళ కొమురయ్య, గన్న బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube