నాగచైతన్య సినిమాలో నన్ను తొక్కేశారు.. టైమ్ వచ్చిందని చెబుతున్నా.. హీరో శ్రీరామ్ కామెంట్స్ వైరల్!

హీరో శ్రీరామ్( Actor sriram ) ప్రధాన పాత్రలో తెరకెక్కిన పిండం సినిమా థియేటర్లలో తాజాగా విడుదలైంది.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శ్రీరామ్ మాట్లాడుతూ షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.

 Actor Sriram Shocking Comments About Dhada Movie Details Here Goes Viral , Actor-TeluguStop.com

దడ సినిమా విషయంలో తనకు అన్యాయం జరిగిందని శ్రీరామ్ కామెంట్లు చేశారు.మల్టీస్టారర్ సినిమాలలో నటించడం నాకు ఇష్టమేనని అయితే చెప్పే కథకు, తీసే కథకు కొన్నిసార్లు లింక్ ఉండదని ఆయన వెల్లడించారు.

దడ సినిమా( Dhada )కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమయంలో ఆ సినిమా ఇద్దరు అన్నాదమ్ముల కథ అని చెప్పారని మూవీకి సపోర్ట్ గా ఉండాలని అన్నారని ఆ మూవీ కోసం థాయ్ లాండ్ లో ఒక ఫైట్ సీన్ కూడా చేశానని శ్రీరామ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.మూడు కెమెరాలతో ఫైట్ సీన్ షూట్ చేశారని ఆ ఫైట్ సీన్ వల్ల నేను 8 నెలలు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని శ్రీరామ్ కామెంట్లు చేశారు.

అయితే దడ మూవీ రిలీజ్ తర్వాత చూస్తే సినిమాలో ఆ ఫైట్ లేదని శ్రీరామ్ అన్నారు.రిస్క్ చేసి ఫైట్ చేసిన సీన్ ను తీసేయడం బాధ కలిగించిందని శ్రీరామ్ వెల్లడించారు.అయితే అందరు దర్శకులు అలా ఉండరని దర్శకుడు శంకర్ స్నేహితుడు సినిమాలో విజయ్ కంటే నాకే ఎక్కువగా డైలాగ్స్ ఇచ్చారని శ్రీరామ్ పేర్కొన్నారు.చాలా సినిమాలలో నా రోల్స్ కట్ అయ్యయాని ఆయన అన్నారు.

ఈ రీజన్ వల్లే సింగిల్ హీరో సినిమాలను ఎంచుకుంటూ మల్టీస్టారర్ సినిమాలకు దూరంగా ఉంటున్నానని శ్రీరామ్ పేర్కొన్నారు.శ్రీరామ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తర్వాత ప్రాజెక్ట్ లతో శ్రీరామ్ కు ఎలాంటి విజయాలు దక్కుతాయో చూడాల్సి ఉంది.శ్రీరామ్ నటించిన పిండం సినిమా(Pindam Movie )కు క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయనే సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube