తెలుగు రాష్ట్రాల ప్రజలు సీనియర్ ఎన్టీఆర్ ను( Sr NTR ) దైవంలా భావిస్తారనే సంగతి తెలిసిందే.ప్రముఖ టాలీవుడ్ నటుడు శివకృష్ణ( Actor Shiva Krishna ) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్ ఆరాధ్య దైవం అని అన్నారు.
సీనియర్ ఎన్టీఆర్ దైవాంశ సంభూతుడు అని ఆయన లాంటి వ్యక్తులు 50 సంవత్సరాలకు ఒకరు పుడతారని శివకృష్ణ అన్నారు.సమాజం క్షీణించే సమయంలో సీనియర్ ఎన్టీఆర్ లాంటి మహానుభావులు పుట్టి వాళ్లు చేయాల్సిన మార్పును చేసి వెళ్లిపోతారని ఆయన కామెంట్లు చేశారు.
60 సంవత్సరాల వయస్సులో ఆయన 15 లక్షల రూపాయల పారితోషికం తీసుకున్నారని శివకృష్ణ అన్నారు.ఆ 15 లక్షల రూపాయలతో మొత్తం హైటెక్ సిటీ అంతా అప్పుడు కొనుగోలు చేయవచ్చని ఆయన కామెంట్లు చేశారు.
ఆ సమయంలో ఎకరా 5,000 రూపాయలు, 10000 రూపాయలు ఉండేదని శివకృష్ణ చెప్పుకొచ్చారు.పేదవాళ్లకు ఏదో చెయ్యాలి చెయ్యాలి అని అనుకుని ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని ఆయన తెలిపారు.
రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఎక్కడా ఒక్క రూపాయి డొనేషన్ తీసుకోలేదని అలాంటి వ్యక్తి ఎన్టీఆర్ అని శివకృష్ణ చెప్పుకొచ్చారు.నేను కాళ్లు పట్టుకుంటే మాత్రమే 5000 డొనేషన్ తీసుకున్నారని ఆయన తెలిపారు.ఎన్టీఆర్ ను ఏ రాజకీయ నాయకునితో పోల్చవద్దని బీసీలకు 67 శాతం సీట్లు ఇచ్చిన ఏకైక సీఎం అని ఆయన తెలిపారు.అప్పట్లో నాకు పెద్దగా పాపులారిటీ లేదని శివకృష్ణ అన్నారు.
సీనియర్ ఎన్టీఆర్ నాకు రాజకీయాల్లో టికెట్ ఇస్తానని చెప్పగా నేను వద్దని చెప్పానని ఆయన తెలిపారు.సీనియర్ ఎన్టీఆర్ బ్రతికుంటే ఆయనే సీఎంగా కొనసాగేవారని శివకృష్ణ చెప్పుకొచ్చారు.నందమూరి ఫ్యామిలీతో ఇప్పటికీ అనుబంధం కొనసాగుతోందని ఆయన తెలిపారు.సీనియర్ ఎన్టీఆర్ మరణించి చాలా సంవత్సరాలు అయినా అభిమానుల హృదయాల్లో మాత్రం ఆయనకు స్థానం ఉందనే సంగతి తెలిసిందే.
బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఆయన నట వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.